Breaking News

నాపై రూమర్స్‌ ఆపేయండి..నాకు ఆ ఉద్దేశమే లేదు: రేణు దేశాయ్

Published on Mon, 01/19/2026 - 15:52

రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. తన పర్సనల్‌ లైఫ్‌ గురించి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారని వాపోయింది. తాను కుక్కల సంరక్షణ కోసమే కృషి చేస్తున్నానని తెలిపింది. కేవలం వాటి గురించే ఈ రోజు ప్రెస్‌మీట్‌లో మాట్లాడానని పేర్కొంది. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని రేణు దేశాయి వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది.

వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ..'నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు. ముందు ఇలాంటి రూమర్స్‌ను ఆపేయండి. ప్రస్తుతం నేను చేస్తున్న సామాజిక సేవలో సంతృప్తిగా ఉన్నా. నాపై తప్పుడు థంబునెయిల్స్ రాస్తున్నారు. నేను ప్రెస్‌మీట్‌కు వచ్చేటప్పుడు చాలామంది గట్టిగా అరిచారు. నా పర్సనల్‌ లైఫ్‌పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ విడిచిపెట్టింది. ఇప్పుడు తనకు అర్థమైంది అంటూ నాపై ఎందుకు ఇలా ఏడుస్తున్నారని' ఆవేదన వ్యక్తం చేసింది.

ఇంకా మాట్లాడుతూ..' నేను ఎవరి కోసం పోరాడుతున్నాను. నేను కుక్కల కోసం పోరాడటం లేదు. కేవలం మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నా. అలాంటి నాపై నీచంగా కామెంట్స్ చేస్తున్నారు. నీ పిల్లలకు కుక్క కరిచి చనిపోతే మీకప్పుడు తెలుస్తుంది అంటున్నారు. నా బిడ్డ ప్రాణాలతో ఎందుకు ముడిపెడుతున్నారు. ఎవరి బిడ్డ ప్రాణాలైనా ఒక్కటే. అది చాలా తప్పు. మీకు ఎక్కడైనా కుక్కలతో సమస్య ఉంటే నా ఎన్జీవోకు లేదా జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇవ్వండి. వచ్చి మేమే తీసుకెళ్లిపోతాం. అంతేకానీ నా పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడొద్దు. నేను ఎలాంటి పాలిటిక్స్‌లోకి జాయిన్ అవ్వడం లేదు. నేను ప్రెస్‌ వాళ్ల మీద ఎక్కడా అరవలేదు. వంద కుక్కల్లో ఒక పది మెంటల్‌ కూడా ఉంటాయి. మనుషుల్లోనూ కొందరు మంచి వాళ్లు ఉంటారు. కొందరు చెడ్డవాళ్లు  ఉంటారు. అవీ కూడా అంతే' అని రేణు దేశాయ్ వెల్లడించింది. 

 

 

Videos

Ravi Teja: ప్రేమ పేరుతో యువతిని మోసం 10 ఏళ్ల జైలు శిక్ష

Palnadu: సిగ్గులేకుండా రికార్డింగ్ డ్యాన్స్ లు పైగా లోకేష్, పవన్ ఫోటోలు

Guntur : కోట్ల భూమికి.. 30 లక్షలా? చెత్త ప్యాకేజీ..

Kannababu : మెడికల్ కాలేజీలకు డబ్బులేవ్ కానీ NTR విగ్రహం కోసం రూ. 1750 కోట్లు

చలో విజయవాడ.. మేమేంటో చూపిస్తాం

ఏపీలో పేకాటలపై కారుమూరి ఫైర్

BRS నాయకుడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ PA దాడి

Jada Sravan: మీరు టీడీపీకే హోం మంత్రి, డిప్యూటీ సీఎంలా

Karanguda : రోడ్లు వేయడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు

Karnataka : ఆఫీస్ లోనే ముద్దులు, కౌగిలింతలు అడ్డంగా దొరికిన DGP..

Photos

+5

హీరోయిన్స్ నయనతార, త్రిషల స్నేహ బంధం... ఫోటోలు

+5

రాతివనం.. అపురూపం

+5

రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)

+5

మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)

+5

మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)