Breaking News

Thousand Note: రూ.వెయ్యి నోటు రద్దుకు 48 ఏళ్లు!

Published on Sat, 01/17/2026 - 11:48

రూ.వెయ్యి నోటు ఎప్పుడు రద్దయ్యిందంటే టక్కున 2016లో మోదీ ప్రభుత్వం రద్దుచేసిందని చెప్పేస్తారు. కానీ అంతకు ముందే కొన్నేళ్ల క్రితం చలామణిలో ఉన్న ఈ రూ.వెయ్యి నోటు రద్దయ్యి నేటి సరిగ్గా 48 ఏళ్లయ్యింది. 1978 జనవరి 15వ తేదీన అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్‌, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిల హయాంలో కొన్ని ఆర్థిక కారణాల రీత్యా పెద్ద నోట్లను రద్దు చేశారు. 72 ఏళ్ల కిందట 1954లో భారత రిజర్వు బ్యాంక్‌ ఈ వెయ్యి నోట్లను విడుదల చేసింది. రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ బి.రామారావు సంతకంతో మొదటిసారిగా ఈ నోటును ముద్రించారు. 

ఈ నోటును కాకినాడకు చెందిన ప్రముఖ నాణేల సేకరణకర్త మార్ని జానకిరామ చౌదరి సేకరించి భద్రపరిచారు. ఈ నోటు 20.3 సెంటీ మీటర్ల వెడల్పు, 12.7 సెంటీమీటర్ల ఎత్తుతో సుమారు పావుఠావు పరిమాణంతో చలామణీలో ఉండేది. జానకిరామ చౌదరి మాట్లాడుతూ నోటుకు ముందువైపు మూడు సింహాల చిత్రం, వెనుకవైపు తంజావూరు (తమిళనాడు) లో వెయ్యేళ్ల కిందట నిర్మించిన బృహదీశ్వరాలయం చిత్రాన్ని ముద్రించారని, దీనితో పాటు చలామణిలో ఉండే ఐదు వేలు, పది వేల రూపాయల నోట్లను కూడా నాటి ప్రభుత్వం 1978 జనవరి 15 తేదీన రద్దు చేసిందని తెలిపారు.

Videos

ట్రంప్ టారిఫ్ బెదిరింపు..

దొరికింది దోచుకో.. అందినంత దండుకో..!

TDP Leader: సొంత నేతలపైనే దాడులు

Ravi Teja : నా మాటవిని సినిమాలు చేయరా బాబు

సంక్రాంతి అంటేనే సంబరాల పండగ అలాంటిది చంద్రబాబు పుణ్యమా అంటూ..

CM Revanth: పాలమూరుకు అన్యాయం BRS పాలనలోనే!

Hyd: ఏటా 20 లక్షల మంది మరణించడం ఖాయం..!

Brahmanaidu: అమాయకులను కాదు.. దమ్ముంటే మమ్మల్ని చంపండి

Hyd: ఒంటరిగా వెళ్తున్న మహిళ.. రెచ్చిపోయిన ఇద్దరు యువకులు

మహిళా డాక్టర్ భర్తపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

Photos

+5

బుడ్డోడితో బీచ్‌లో బుల్లితెర నటి లహరి (ఫోటోలు)

+5

నువ్వే పెద్ద బంగారానివి! (ఫోటోలు)

+5

మిహికా: 2016.. అంతా సెల్ఫీలమయం (ఫోటోలు)

+5

‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్‌ సెలెబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా జగ్గన్నతోట ప్రభల తీర్ధ ఉత్సవాలు (చిత్రాలు)

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)