మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం
Breaking News
మల్టీస్టారర్ మూవీ.. నెలరోజుల్లోనే ఓటీటీలోకి..
Published on Fri, 01/16/2026 - 15:28
కన్నడ స్టార్ హీరోలు శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్.బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 45. సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వం వహించిన ఈ మూవీ కన్నడలో డిసెంబర్ 25న విడుదలైంది. అయితే తెలుగులో మాత్రం కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్రం నెలరోజుల్లోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. జీ5లో జనవరి 23న రిలీజ్ అవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
కథ
వినయ్ (రాజ్. బి శెట్టి) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఓ రోజు అనుకోకుండా అతడి బైక్ ఢీ కొట్టి రోసీ అనే కుక్క చనిపోతుంది. ఆ కుక్క రాయప్ప(ఉపేంద్ర) అనే డాన్‌కు చెందినది. ప్రాణంగా చూసుకునే కుక్క చావుకు కారణమైన వినయ్‌ను 45 రోజుల్లో చంపాలనుకుంటాడు. అప్పటినుంచి అతడి జీవితం అయోమయంగా మారుతుంది. ఆ సమయంలో వినయ్ జీవితంలోకి శివ (శివ రాజ్‌కుమార్) వస్తాడు. అసలు ఈ శివ ఎవరు? రాయప్ప వినయ్‌ను చంపేశాడా? చివరకు ఏం జరిగిందనేది తెలియాలంటే 45 సినిమాను ఓటీటీలో చూడాల్సిందే!
45 The Biggest Movie Of 2025
45 Streaming On Jan 23rd In Kannada Zee5#45TheMovie #KannadaZEE5 #45OnZEE5 #ZEE5Cinemas #ZEE5 pic.twitter.com/uUFZWCE04Y— ZEE5 Kannada (@ZEE5Kannada) January 16, 2026
చదవండి: ది రాజాసాబ్ కలెక్షన్స్.. ఫస్ట్ వీక్ ఎంతంటే?
Tags : 1