Breaking News

తట్టుకోలేకపోయా, గదిలో కూర్చుని ఏడ్చా..: షారూఖ్‌ కూతురు

Published on Thu, 01/15/2026 - 12:38

కింగ్‌ షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా 'ద ఆర్చీస్‌' మూవీతో సినీప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడేకంగా తండ్రితో కలిసి నటించబోతోంది. షారూఖ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న కింగ్‌ చిత్రంలో సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే చిన్నప్పుడు యాక్టింగ్‌ అంటే ఆసక్తే ఉండేది కాదని, రానురానూ తన ఆలోచన మారిందని చెప్తోంది.

ఒంటరిగా ఏడ్చా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహానా మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్‌లో నాటకాల్లో పాల్గొనాలంటే అస్సలు ఇంట్రస్ట్‌ ఉండేది కాదు. కానీ, తర్వాత సడన్‌గా నాకు దానిపై ఆసక్తి పెరిగింది. ఓసారి స్కూల్‌లో వేయబోయే ఒక నాటకం కోసం ఆడిషన్‌ ఇచ్చాను, కానీ నేను కోరుకున్న పాత్రలో నన్ను సెలక్ట్‌ చేయలేదు. ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చారు. చాలా బాధపడ్డాను. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చాను. 

కింగ్‌ సినిమాలో..
అప్పుడు నాకు యాక్టింగ్‌పై ఎంత ఇష్టం ఉందనేది తెలిసింది. స్టేజీపై పర్ఫామ్‌ చేస్తుంటే ఆ కిక్కే వేరు. ఆ ప్యాషన్‌ ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. కింగ్‌ సినిమా విషయానికి వస్తే.. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తుండగా షారూఖ్‌ కూతురు సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. 'కింగ్‌' షారూఖ్‌తో దీపికా నటిస్తున్న ఆరో సినిమా కావడం విశేషం! గతంలో వీరిద్దరూ ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, హ్యాపీ న్యూ ఇయర్‌, పఠాన్‌, జవాన్‌ సినిమాల్లో కలిసి నటించారు.

చదవండి: 37 ఏళ్ల తర్వాత మొదటి హీరోను కలిసిన స్టార్‌ హీరోయిన్‌

Videos

ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం

Kasu Mahesh: చనిపోయే వ్యక్తిపై కూటమి కేసు ఎవరినీ వదిలిపెట్టం

విజయ్ కు షాక్.. జన నాయగన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

'సంస్కార హీనుడు చంద్రబాబు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి గారి బాగోతం.. గుడ్ మార్నింగ్ ధర్మవరంపై కేతిరెడ్డి

టీడీపీ గుండాల దాడిలో YSRCP కార్యకర్త సాల్మన్ మృతి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

సంక్రాంతికి హెలికాప్టర్‌ రైడ్‌ ..!

గోవింద రెడ్డి ఆరోగ్యం విషమం

జపాన్ లో పుష్పరాజ్: Allu Arjun

Photos

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)