గుడివాడ అమర్నాథ్ ఇంట్లో భోగి సంబరాలు
Breaking News
బోరుమని ఏడ్చిన అనసూయ.. అందుకే కన్నీళ్లాగలేదు!
Published on Wed, 01/14/2026 - 14:27
ఆడవారిపై నోరు పారేసుకున్న నటుడు శివాజీని కడిగిపారేసింది యాంకర్, నటి అనసూయ భరద్వాజ్. కానీ కొందరు శివాజీ లాంటి పురుషాహంకార ధోరణి ఉన్నవాళ్లు మాత్రం అనసూయనే ట్రోల్ చేశారు. ఆమెను, ఆమె కుటుంబాన్ని దారుణంగా విమర్శించారు. అయినా అనసూయ వెనక్కు తగ్గకుండా స్త్రీ హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఓ ప్రెస్‌మీట్‌కు వీడియో కాల్ ద్వారా హాజరైంది. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది.
నేను బాగున్నా..
తాజాగా తన కన్నీళ్లకు గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నిన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో జూమ్ కాల్ ద్వారా మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు నన్నెంతో భావోద్వేగానికి గురి చేసింది. అదే సమయంలో కొంతకాలంగా నేను శారీరకంగా అనారోగ్యంతో ఉండటంతో, ఆ బలహీన క్షణంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇది మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. నేను పూర్తిగా బాగున్నాను.
మనమంతా మనుషులమే
మన స్వయం నిర్ణయాధికారానికి మద్దతుగా మాట్లాడినందుకు నేనుగానీ, ఏ మహిళ అయినా సరే ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుక్కోవడం నిజంగా బాధాకరం. కానీ, అదే సమయంలో నా వెనక నిలబడ్డ అద్బుతమైన, బలమైన మహిళల వల్ల నాకు అపారమైన ధైర్యం లభిస్తోంది. మనమంతా మనుషులమే.. మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు.
అన్నీ దాటుకుని నిలబడతా..
ముఖ్యమైనది ఒక్కటే.. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా బూడిద నుంచి మళ్లీ లేచి, అన్ని అడ్డంకులు ఎదురొడ్డి నిలబడతాను. ఎవరి బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాభపడాలని చూస్తారో అది వారి స్వభావాన్ని మాత్రమే చూపిస్తుంది.. నన్ను కాదు. నిన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో.. నేను అక్కడ లేకపోయినా, ధైర్యం, ఐక్యతతో మాట్లాడిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మానవత్వాన్ని ఎంచుకుందాం
అది నాకు నిజమైన సాధనగా అనిపిస్తోంది. నేను ఏదైనా చెప్పాలనుకుంటే అది నేరుగా నా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారానే తెలియజేస్తాను. అంతవరకు మౌనంగానే ఉంటాను. మనమంతా శాంతి, సానుభూతి, మానవత్వాన్ని ఎంచుకుందాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని అనసూయ రాసుకొచ్చింది.
చదవండి: నన్ను లాక్కెళ్లి ముద్దుపెట్టాలని చూశారు: అనిల్ రావిపూడి
Tags : 1