గుడివాడ అమర్నాథ్ ఇంట్లో భోగి సంబరాలు
Breaking News
'ప్రభాస్'ను ఒంటరిని చేశారా..? వాళ్లందరూ ఎస్కేప్
Published on Wed, 01/14/2026 - 11:13
ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమా 'ది రాజా సాబ్'.. జనవరి 9న అందరికంటే ముందే సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే, సినిమాలో కొన్ని సీన్స్ తొలగించి ప్రభాస్ ఓల్డ్ గెటప్ సన్నివేశాలు ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ కూడా అన్నారు. దీంతో మారుతి వెంటనే సరిచేసి రెండోరోజే రీవర్షన్ చేశారు. దీంతో సినిమాపై మళ్లీ పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇంతలో పండగ సినిమాలన్ని వరుసగా వస్తున్నాయి. దీంతో రాజాసాబ్ కొన్ని స్క్రీన్స్ కోల్పోతూ వచ్చింది. అయితే, అడ్వాంటేజ్ ఉన్నప్పుడు సినిమాకు ప్రమోషన్ కరువైంది. సినిమా విడుదల ముందురోజు వరకు గట్టిగానే ప్రచారం చేశారు. కానీ, పోస్ట్-రిలీజ్ ప్రమోషన్ లేకపోవడంతో కలెక్షన్స్‌పై భారీ దెబ్బ పడింది. సినిమాకు ఎటూ పాజిటీవ్ వస్తుంది కాబట్టి.. కనీసం ఈ వీకెండ్ వరకు అయినా కాస్త ప్రమోషన్స్ జోష్ పెంచితే బెటర్ అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.
ప్రభాస్ దర్శకుల స్పందన కరువు
రాజా సాబ్ రిలీజ్ తర్వాత కేవలం ఓ ప్రెస్ మీట్ పెట్టి చిత్ర యూనిట్ మమ అనిపించింది. ఆ తర్వాత కేవలం సోషల్‌మీడియాకే పరిమితం అయ్యారు. ప్రభాస్ అందుబాటులో లేడు కాబట్టి కనీసం తన పాత దర్శకులతో వీడియో బైట్స్, కామెంట్స్ అయినా చేపించుకోలేకపోయారు. పాన్ ఇండియా రేంజ్‌లో పేరున్న దర్శకులు రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, సుజీత్ వంటి వారందరికి ప్రభాస్‌తో మంచి స్నేహమే ఉంది. వాళ్లతో కలిసి ఆయన పనిచేశారు కూడా..
కానీ, వాళ్లు కూడా రాజా సాబ్ గురించి ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఇదే విషయాన్ని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు తెరలేపారు. రాజా సాబ్ సినిమాను రీకట్ చేసిన తర్వాత చాలా బాగుందని టాక్ వస్తుంది. కామన్ ఆడియన్స్ కూడా ఇదే మాట అంటున్నారు. కానీ, సరైన ప్రమోషన్‌తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరూ సినిమా గురించి మాట్లాడకపోవడం కాస్త డ్యామేజ్‌ను పెంచాయని ఎక్కువగా వినిపిస్తుంది.
ఎస్కేఎన్.. ఎస్కేప్
రాజా సాబ్ విడుదలకు నిర్మాత ఎస్కేఎన్ భారీ డైలాగ్స్ పేల్చాడు. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని తనదైన స్టైల్లో పండగ..పండగ..రాజాసాబ్ పండగ అంటూ హైప్ పెంచాడు. అంతటితో ఆయన ఆగలేదు తన చొక్కా చించి మరీ రాజాసాబ్ పోస్టర్‌ను ఫ్యాన్స్‌కు చూపించి తన భక్తిని చూపించాడు. సినిమా విడుదల తర్వాత కనీసం ఆయన కూడా రాజాసాబ్‌కు దూరంగానే ఉన్నాడు. అయితే, సంగీత దర్శకులు తమన్ గతంలో రాధేశ్యామ్ ఫ్లాప్ అయినప్పుడు మూవీ ప్రమోషన్‌కు ఎవరూ రాలేదు.
అప్పుడు స్వయంగా తమన్ రంగంలోకి దిగాడు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెబుతూ కాస్త ప్రమోషన్ చేశాడు. ఇప్పుడు కనీసం తమన్‌ను మరోసారి రంగంలోకి దింపినా బాగుండు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వీకెండ్ వరకు అయినా సరే మారుతి, తమన్, ఎస్కేఎన్‌లతో పాటు ముగ్గురు హీరోయిన్లను రంగంలోకి దింపి ప్రమోషన్స్ చేస్తే కాస్త కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రాజా సాబ్ రూ. 220 కోట్లకు దగ్గరలో ఉన్నాడు.
Tags : 1