Breaking News

విజయ్‌ ఫ్యాన్స్‌పై 'సుధా కొంగర' సంచలన కామెంట్స్‌

Published on Wed, 01/14/2026 - 07:52

తమిళనాడులో శివకార్తికేయన్‌, విజయ్‌ దళపతి ఫ్యాన్స్‌ వార్‌ పెద్ద ఎత్తున జరుగుతుంది. తాజాగా విడుదలైన ‘పరాశక్తి’పై విజయ్‌ అభిమానులు దుష్ప్రచారం చేస్తున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన  దేవ్ రామ్‌నాథ్‌  ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బుక్‌ మై షోలో నెగెటివ్‌ రివ్యూలు ఇవ్వడమే కాకుండా మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొన్ని ఆధారాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ విజయ్‌ ఫ్యాన్స్‌పై ఫైర్‌ అయ్యారు.

రౌడీయిజంతో పోరాడుతున్నాం
ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సుధా కొంగర  ఇలా అన్నారు. 'ప్రస్తుత కాలంలో సినిమాను ప్రేక్షకులకు చేర్చడంలో చాలా కష్టపడాల్సి వస్తుంది.  ఈ మార్కెటింగ్ యుగంలో  ఎన్నో సవాళ్లను దాటుకోవాలి. సినిమా బాగున్నా సరే తప్పుడు ప్రచారంలో ఇబ్బందులు తప్పవు. పొంగల్ వారాంతంలో మా సినిమా (పరాశక్తి) మరింత మందికి చేరువవుతుందని నేను ఆశిస్తున్నాను. ఒక  నటుడి అభిమానుల వల్ల మేము చాలా సమస్యలు  ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫేక్‌ ఐడీలతో మాపై చాలా దారుణమైన పోస్టులు చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. విజయ్‌ ఫ్యాన్స్‌ పేరుతో కొన్ని ఖాతాల నుంచి షేర్‌ చేసిన పోస్టులు మరింత నీచంగా ఉన్నాయి.  రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం ఏంటి.. తమ హీరో సినిమా విడుదల కాలేదని ఆయన ఫ్యాన్స్‌ చేసే హెచ్చరికలు ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. మేము రౌడీయిజం, గూనిజంతో పోరాడుతున్నాం.' అంటూ ఆమె అన్నారు.

జన నాయగన్‌, పరాశక్తి రెండు సినిమాలకు సెన్సార్‌ చిక్కులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పరాశక్తి మూవీకి 25 కట్స్‌ సూచించి విడుదలకు 4గంటల ముందు సెన్సార్‌ ఇచ్చారు. కానీ, జన నాయగన్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు. పరాశక్తి సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా ఉదయ్‌నిధి స్టాలిన్ పంపిణీ చేశారు. దీంతో జన నాయగన్‌పై రాజకీయ కుట్ర జరిగిందని విజయ్‌ ఫ్యాన్స్‌ భావించారు. అందుకే పరాశక్తి సినిమా పట్ల వారు నెగటివ్‌ రివ్యూలు ప్రారంభించారని తెలుస్తోంది.

Videos

ఇరాన్ లో మారణహోమం.. 12 వేల మంది మృతి

హైదరాబాద్ కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

నా డ్యాన్స్ క్రేజ్ కు పవనే కారణం.. అంబటి అదిరిపోయే సెటైర్లు

KSR Show: పోలీసులే దోషులు..! కత్తులు కట్టి

Bhogi Celebrations : అంబటి మాస్ డ్యాన్స్

Special Program: సంక్రాంతి సంప్రదాయాల... భీమవరం పిండివంటలు

ఆర్కే రోజా ఇంట్లో భోగి సంబరాలు కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్

అంబటి రాంబాబు భోగి డ్యాన్స్ 2026

విభజన హామీలు ముగిశాయనే వాళ్లు ఆంధ్రా ద్రోహులు: చలసాని

Ravi Chandra : లోకేష్ రెడీగా ఉండు.. నీ కాలర్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు

Photos

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)