Bolla Brahmanaidu: సంబంధం లేని వ్యక్తులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు..
Breaking News
కంగ్రాట్స్ మామయ్య.. చిరుకు మెగా కోడలు స్పెషల్ విషెస్
Published on Mon, 01/12/2026 - 20:53
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచి హిట్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. పలువురు టాలీవుడ్ సినీతారలు మూవీ టీమ్‌ను అభినందిస్తున్నారు.
తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల సైతం మనశంకర వరప్రసాద్‌కు అభినందనలు తెలిపింగి. 'ఇది మెగా సంక్రాంతి.. హృదయపూర్వక అభినందనలు మామయ్య' అంటూ ఈ సినిమాలోని ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేసింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రానికి మొదటి షో నుంచే సూపర్ హిట్ అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఈ సినిమాను ఏఎంబీ సినిమాస్‌లో రామ్ చరణ్ వీక్షించారు.
It’s a MEGA SANKRANTHI
hearty congratulations
Mamaya @KChiruTweets @NayantharaU @sushkonidela
❤️❤️❤️❤️❤️🧿🙌 pic.twitter.com/xFhxbcV8Sc— Upasana Konidela (@upasanakonidela) January 12, 2026
Tags : 1