Bolla Brahmanaidu: సంబంధం లేని వ్యక్తులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు..
Breaking News
పీరియడ్స్.. ఒక్కరూ నా బాధ అర్థం చేసుకోలే: హీరోయిన్
Published on Mon, 01/12/2026 - 13:08
ఒక్కసారి డేట్స్ ఇచ్చాక చెప్పిన సమయానికి సెట్‌లో ఉండాల్సిందే! అది హీరోలైనా, హీరోయిన్లయినా! అయితే కొన్నిసార్లు పీరియడ్స్ వల్ల నటీమణులు ఇబ్బందిపడుతుంటారు. దాన్ని బయటకు చెప్పుకోలేక, చెప్పినా అర్థం చేసుకోరేమోనన్న భయంతో లోలోపలే మథనపడుతుంటారు. తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోతు. ధనుష్ హీరోగా నటించిన 'మార్యన్' అనే తమిళ మూవీలో పార్వతి కథానాయికగా యాక్ట్ చేసింది.
రొమాంటిక్ సీన్
ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటనను పార్వతి తాజాగా గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. మార్యన్ సినిమాలో ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని బీచ్‌లో షూట్ చేశారు. నన్ను పూర్తిగా నీళ్లలో ముంచి తడిపారు. నేను అదనపు డ్రెస్ తీసుకెళ్లలేదు. షూటింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. నాకేమో చాలా అసౌకర్యంగా ఉంది. అదెవరూ గమనించట్లేదు.
ఒప్పుకోలేదు
ఓ పక్క పీరియడ్స్.. మరోపక్క నీళ్లలో తడవడంతో చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. ఒకసారి హోటల్‌కు వెళ్లి బట్టలు మార్చుకుని వస్తానని చెప్పాను. వాళ్లు కుదరదన్నారు. అంతే, నా కోపం నషాళానికి అంటింది. నేను పీరియడ్స్‌లో ఉన్నాను.. కచ్చితంగా వెళ్లి తీరాలి అని గట్టిగా అరిచి చెప్పాను. వెంటనే సెట్‌లో ఉన్నవారంతా షాకై అలా చూస్తున్నారు. వాళ్లు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఆరోజు సెట్‌లో నాతో కలిపి ముగ్గురు ఆడవాళ్లే ఉన్నారు.
ఒంటరిగా ఫీలయ్యా
చాలాసేపటివరకు నా ఇబ్బందిని చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఆ సమయంలో నేను ఒంటరిగా ఫీలయ్యాను. నాలో ఓపిక కూడా నశించింది అని చెప్పుకొచ్చింది. పార్వతి తిరువోతు మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో రెండు మూవీస్‌లో యాక్ట్ చేస్తోంది.
చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Tags : 1