ఓటీటీలో '120 బహదూర్‌'.. ఉచితంగానే స్ట్రీమింగ్‌

Published on Sun, 01/11/2026 - 19:49

బాలీవుడ్ న‌టుడు ఫర్హాన్ అక్తర్ న‌టించిన కొత్త సినిమా ‘120 బహదూర్‌’ ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, ప్రస్తుతం అదనంగా రూ. 349 అద్దె చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించకుండా సినిమా చూసే అవకాశం  రానుంది. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రజనీష్‌ (రాజీ ఫేమ్) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పరమ వీర చక్ర అవార్డ్‌ అందుకున్న మేజర్ సైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ అక్తర్ మెప్పించారు. ఇందులో రాశీఖన్నా కీల‌క పాత్ర‌లో నటించింది. గతేడాదిలో విడుదులైన ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్‌ లేకుండా ప్రభుత్వాలు అనుమతులు కూడా ఇచ్చాయి.

‘120 బహదూర్‌’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జనవరి 16నుంచి  ఉచితంగా చూడొచ్చని ప్రకటించారు. భాగ్ మిల్కా భాగ్ త‌ర్వాత ఫర్హాన్ అక్తర్ మ‌రోసారి బ‌యోపిక్ చేయడంతో భారీగా ఫ్యాన్స్‌ ఈ మూవీ కోసం ఎదురుచూశారు. ఈ హిస్టారికల్‌ మూవీ అందరినీ మెప్పిస్తుంది. కానీ, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు.

'120 బహదూర్' విషయానికొస్తే.. మేజర్ షైతాన్ సింగ్ భాటి(ఫర్హాన్ అక్తర్).. తన 120 మంది సైనికులతో ఇండియా-చైనా బోర్డర్‌లో ఎలాంటి యుద్ధం చేశాడు.  మూడు వేల మంది చైనా సైనికుల్ని ఎలా నిలువరించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. యుద్ధ తరహా సినిమాలంటే ఇష్టముండే వాళ్లకు ఇది నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు రొటీన్‌గానే అనిపించొచ్చు. స్టోరీ తెలిసిందే అయినప్పటికీ.. విజువల్స్, యాక్టింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి.

Videos

మాంజా ఎంత డేంజరో చూపించిన పోలీసులు

దద్దరిల్లుతున్న ఇరాన్.. ఖమేనీ ఫోటో కాల్చి సిగరెటికి నిప్పు

ఏపీలో వివాదాస్పదంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తీరు

అయ్యా ABN మెంటల్ కృష్ణ.. రాధా కృష్ణ తుక్కు రేగొట్టిన నాగమల్లేశ్వరి

మిగిలేది ఆవకాయ తొక్కే.. బాబు, పవన్ పై బైరెడ్డి సెటైర్లే సెటైర్లు

కండలేరు వద్దకు వెళ్తున్న YSRCP నేతల అక్రమ అరెస్ట్

చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం.. పండగ పూట కూలీల పస్తులు

మన శంకరవరప్రసాద్ గారు మూవీ పబ్లిక్ టాక్

సంక్రాంతి కిక్కు.. జీవో రాకముందే మద్యం ధరల పెంపు

దళపతి విజయ్ అరెస్ట్..?

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)