Breaking News

నాతో నేను పోటీ పడుతుంటాను: సంయుక్త

Published on Sun, 01/11/2026 - 01:24

‘‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్‌: ది సీక్రెట్‌ ఏంజెట్, అఖండ 2’.. ఇలా నా కెరీర్‌లో నటిగా నేను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలే చేస్తున్నాను. భవిష్యత్‌లో బయోపిక్‌ సినిమాల్లో నటించాలని ఉంది. ఇటీవల హిందీలో ‘హక్‌’ (యామీ గౌతమ్‌ నటించారు) అనే సినిమా చూశాను. కొన్ని సన్నివేశాలకు భావోద్వేగానికి గురై ఏడ్చాను.

ఈ తరహా పాత్రలూ చేయాలని ఉంది’’ అని చెప్పారు హీరోయిన్స్  సంయుక్త. శర్వానంద్‌ హీరోగా  రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంయుక్త విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో దియా అనే పాత్రలో నటించాను.

తోటియాక్టర్స్‌తో పోలిక పెట్టుకోను. ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరచుకోవడానికి నాతో నేను పోటీ పడుతుంటాను. శర్వాగారి నుంచి మంచి కామిక్‌ టైమ్‌ను నేర్చుకున్నాను. సాక్షితో మంచి అనుబంధం ఏర్పడింది. రామ్‌గారు క్లారిటీ ఉన్న డైరెక్టర్‌. అనిల్‌గారు ఫ్యాషనేట్‌ ప్రోడ్యూసర్‌. పూరి జగన్నాథ్‌–విజయ్‌ సేతుపతిగార్ల సినిమాలో నటించాను. నేను మెయిన్స్  లీడ్‌లో ‘ది బ్లాక్‌గోల్డ్‌’ మూవీ చేస్తున్నాను’’ అని తెలిపారు.

Videos

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

కాకాణి పై పోలీసుల అత్యుత్సాహం

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)