Srikakulam: మృత్యు వలయంలో తాబేళ్లు
Breaking News
సడన్ సర్‌ప్రైజ్.. సంక్రాంతికి విజయ్ మూవీ రిలీజ్
Published on Sat, 01/10/2026 - 18:53
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్. ముందుగా బ్యాడ్‌న్యూస్ ఏంటంటే.. జన నాయగణ్ ఈ నెలలో రిలీజ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. గుడ్‌న్యూస్ ఏంటంటే.. సంక్రాంతికి జన నాయగణ్ లేకపోయినా విజయ్ బ్లాక్‌బస్టర్ మూవీ తేరి థియేటర్లలో రీరిలీజ్ అవుతోంది.
పదేళ్ల సందర్భంగా..
ఈ విషయాన్ని నిర్మాత ఎస్.కలైపులి థాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తేరి సినిమా వచ్చి ఈ ఏడాది ఏప్రిల్ 14కి పదేళ్లవుతుంది. ఈ క్రమంలో మళ్లీ అదే తారీఖున విజయ్ సినిమాను రీరిలీజ్ చేయాలని ఎప్పుడో ప్లాన్ చేశారు. కానీ విజయ్ చివరి మూవీ 'జననాయగణ్' సంక్రాంతికి రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
తేరి రీరిలీజ్
వారికి కాస్త ఊరటనిచ్చేందుకు తేరి రిలీజ్‌ను ముందుకు జరిపారు. ఈ సంక్రాంతికి అంటే జనవరి 15న మళ్లీ విడుదల చేస్తున్నారు. తేరి సినిమా విషయానికి వస్తే ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. తేరీ తెలుగులో పోలీసుడు పేరిట డబ్ అయింది. ఈ సూపర్ హిట్ సినిమా పలు భాషల్లో రీమేక్ అయింది. గతేడాది హిందీలో బేబీ జాన్‌గా రీమేక్ అవగా బాలీవుడ్‌లో ఆకట్టుకోలేకపోయింది.
ஜனவரி 15 முதல் அகிலமெங்கும்
Thalapathy @actorvijay @Atlee_dir @gvprakash @Samanthaprabhu2 @iamAmyJackson #ThalapathyVijay #Theri #10YearsOfTheri pic.twitter.com/on3Pr30enp— Kalaippuli S Thanu (@theVcreations) January 10, 2026
చదవండి: బాలీవుడ్ ఎంట్రీ? స్పందించిన మలయాళ హీరోయిన్
Tags : 1