పది మంది మంత్రులు YS జగన్ పై ఎదురుదాడి..
Breaking News
'మన శంకర వరప్రసాద్‌గారి'పై హైకోర్టులో పిటిషన్
Published on Sat, 01/10/2026 - 18:22
తెలంగాణలో మన 'శంకర వర ప్రసాద్‌గారు' చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, తాజాగా దానిని తప్పుబడుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సినిమా టికెట్ ధరల పెంపు అంశాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ, తను వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు పక్కనపెట్టింది. న్యాయస్థానం పనివేళల్లో మాత్రమే పిటిషన్ దాఖలు చయాలని కోరింది. దీంతో సంక్రాంతి తర్వాత జనవరి 19న మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు.
చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు. అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Tags : 1