రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్
Breaking News
రాజాసాబ్ రిలీజ్.. థియేటర్లలో మొసళ్లు!
Published on Fri, 01/09/2026 - 07:43
డార్లింగ్ ప్రభాస్ హారర్ జానర్‌లో తొలిసారి నటించిన చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. గురువారం (జనవరి 8) నుంచే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి. దీంతో అభిమానులు థియేటర్ లోపల, బయట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మొసళ్లు పట్టుకుని థియేటర్‌లో హంగామా చేసినట్లు వీడియోలు వైరలవుతున్నాయి.
థియేటర్‌లో మొసళ్లు?
అయితే అవి నిజం మొసళ్లు కాదు, డమ్మీవి.. ఆ మాటకొస్తే కొన్ని వీడియోలు కూడా నిజమైనవి కావని తెలుస్తోంది. ఓ వీడియోలో సీట్లన్నీ ఒకవైపు ఉంటే.. స్క్రీన్ మాత్రం సీట్లకు ఎదురుగా కాకుండా కుడివైపు ఉంది. దీన్ని బట్టి అది ఫేక్ వీడియో అని ఇట్టే అర్థమవుతోంది. మరో వీడియోలో అయితే అందరూ మొసళ్లు పట్టుకుని రాజాసాబ్ అని నినాదాలు చేస్తున్నారు.
అదీ సంగతి!
ఇక ఇంకో వీడియోలో ఓ బొమ్మ మొసలిని పట్టుకుని ఆడించారు. ఇదైతే నిజమే అని తెలుస్తోంది. ది రాజాసాబ్ మూవీలో ప్రభాస్ మొసలితో పోరాడే సన్నివేశం ఉంటుంది. ట్రైలర్‌లోనూ ఆ క్లిప్ చూపించారు. దీంతో అభిమానులకు థియేటర్‌లో మొసళ్లు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. కొందరు డమ్మీ బొమ్మలతో ఆడుతుంటే మరికొందరు ఏకంగా ఏఐ వీడియోలు సృష్టిస్తున్నారు.
సినిమా
రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటులు సంజయ్‌దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్‌గా విడుదలైంది.
Prompt crt ga eyaledu bhai adu screen atu side untey seats etu side pettadu https://t.co/mlcCuWnGui
— Nikkar Narayana ™ (@urstrulynikkar1) January 8, 2026
Omg 😱 see the Rebels bring crocodile 🐊 to #RajaSaab movie theatres 🥵🔥💥#Prabhas 🔥🔥🥵 pic.twitter.com/4FuA3V1UdP
— ℙℝ𝔼𝔼𝕋𝕐 (@MySelf_Preety) January 8, 2026
Ehh mental nakoduluu crocodile 🐊 ni sav dengaru climax lo edi USA ani chepandra vadikii 🥵🥵🥵😭😭💥💥💥💥💥#RajaSaab pic.twitter.com/e7Io1fZ1PZ
— Virat Kohli (@Kranthi_1322) January 8, 2026
చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ
Tags : 1