రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్
Breaking News
పలు సవాళ్లు.. అన్నీ దాటుకుని సినిమా తీశా: సుధా కొంగర
Published on Fri, 01/09/2026 - 07:02
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం పరాశక్తి. శ్రీలీల హీరోయిన్. రవిమోహన్ ప్రతినాయకుడిగా, అధర్వ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో నిర్మాత ఆకాశ్ భాస్కర్ తన డాన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శనివారం తెరపైకి రానుంది.
స్క్రీన్‌ప్లే రాయడమే ఛాలెంజింగ్
ఈ సందర్భంగా దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ.. పరాశక్తి సినిమా కథ రాసినప్పుడు పలువురి నుంచి అభినందనలు, అదే సమయంలో కథ గురించి పలు సందేహాలు తలెత్తాయన్నారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాయడమే ఛాలెంజింగ్‌గా మారిందన్నారు. అదే విధంగా సినిమా రిలీజ్ తర్వాత పలు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురూ హెచ్చరించారన్నారు.
అసాధ్యాలను సుసాధ్యం చేయాలని
అయితే దర్శకుడు మణిరత్నంలాగా ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలని భావించి.. పలు సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ సినిమాను నమ్మిన నిర్మాత ఆకాశ్ భాస్కర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నటీనటులతో పాటు, సాంకేతిక వర్గం ఈ సినిమాకోసం ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. పరాశక్తి తమిళ చిత్రపరిశ్రమలో ప్రత్యేక సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.
Tags : 1