Breaking News

అమెరికా తప్పుకున్నా భారత్‌ ముందుకే 

Published on Fri, 01/09/2026 - 04:28

న్యూఢిల్లీ: అమెరికా వైదొలిగినప్పటికీ, మిగిలిన 125 దేశాలతో కలసి భారత్‌ అంతర్జాతీయ సోలార్‌ కూటమిని ముందుకు నడిపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌(ఐఎస్‌ఏ) అన్నది భారత్, ఫ్రాన్స్‌ సంయుక్త సహకారంతో ఏర్పడిన కూటమి. సౌర ఇంధన పరిష్కారాలతో వాతావరణ మార్పులపై పోరాటం కోసం ఏర్పాటైన సంస్థ. 2015లో పారిస్‌లో కాప్‌21 సదస్సు సందర్భంగా దీనికి బీజం పడింది.

 ఐక్యరాజ్యసమితిలోని అన్ని దేశాలూ ఇందులో చేరేందుకు అనుమతి ఉంది. ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ సహా 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడం తెలిసిందే. వీటిల్లో భాగస్వామ్యం అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొనడం గమనార్హం. ఐఎస్‌ఏ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు వచి్చన మీడియా నివేదికలు ప్రభుత్వం దృష్టికి వచి్చనట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

మిగిలిన దేశాలతో కూటమి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశాయి. సౌర విద్యుత్‌ అభివృద్ధి, నిధుల సమీకరణ, సామర్థ్యం ఏర్పాటుపై కృషి కొనసాగుతుందని చెప్పాయి. భారత్‌ అధ్యక్షత వహిస్తున్న ఐఎస్‌ఏలో ఇప్పుడు 125 సభ్య దేశాలుగా ఉన్నాయి. సోలార్‌ ఇంధన సామర్థ్యం విస్తరణలో సభ్య దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ కూటమి దృష్టి సారిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఐఎస్‌ఏ ఏర్పాటైన నాటి నుంచి సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే విషయంలో ఎంతో కృషి జరగడం గమనార్హం.  

Videos

చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా

హైకోర్టు తీర్పు ప్రభుత్వం, అధికారులకు చెంపపెట్టు: పేర్ని నాని

చాకిరీ మాకు.. పదవులు మీ వాళ్లకా? పవన్‌ను నిలదీసిన నేతలు

East Godavari: చంద్రబాబు బహిరంగ సభకు కనిపించని ప్రజా స్పందన

Business: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట..!

పోలీసుల తీరుపై మనోహర్ రెడ్డి ఫైర్

అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తావా? లోకేష్ వ్యాఖ్యలకు పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్

శబరిమల బంగారం చోరీలో పురోగతి అర్చకుడు అరెస్ట్..

Photos

+5

ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)