చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా
Breaking News
కాశీలో రుద్ర తాండవం
Published on Fri, 01/09/2026 - 01:03
‘వారణాసి’లో ప్రత్యర్థుల బెండు తీస్తున్నారట రుద్ర. ఈ రుద్ర తాండవం ఎలా ఉంటుందో సిల్వర్ స్క్రీన్‌పై ఆడియన్స్ చూసేందుకు కొంత సమయం ఉంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఫారెస్ట్ అడ్వెంచరస్ అండ్ మైథాలజీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్రపాత్రలో మహేశ్‌బాబు, మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఓ కీలకపాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. ముందు మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్‌లోని సన్నివేశాలను చిత్రీకరించారట. ప్రస్తుతం మహేశ్‌బాబు పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ కోసం కాశీ నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారు మేకర్స్. ఈ సెట్‌లోనే ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. కేఎల్. నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 వేసవిలో విడుదల కానుంది.
Tags : 1