మూడో ‘ఆర్థిక శక్తి’గా భారత్‌ ఎదగాలంటే..

Published on Thu, 01/08/2026 - 16:29

భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే దిగుమతులు తగ్గించుకుని, ఎగుమతులను పెంచుకోవాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. సీఎస్‌ఐఆర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా వ్యవసాయ వ్యర్థాలను విలువైన జాతీయ వనరుగా మార్చుకోవడం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చని చెప్పారు. దీనివల్ల వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం కారణంగా వెలువడే కాలుష్యాన్ని నిరోధించొచ్చన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 15 శాతం కలపడం ద్వారా ఏడాదిలో 4,500 కోట్ల డాలర్ల విదేశీ మారకాన్ని ఆదా చేసుకోవచ్చని చెప్పారు.

ఇటీవలే జపాన్‌ను దాటేసి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడం తెలిసిందే. రహదారుల నిర్మాణంలో బయో బిటుమన్‌ను (పెట్రోలియం రహిత) వినియోగించడం 2047 నాటికి వికసిత్‌ భారత్‌ దిశగా పరివర్తనాత్మక అడుగుగా మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. వాణిజ్య పరంగా బయో బిటుమన్‌ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం భారత్‌ అని చెప్పారు. ఇది రైతుల జీవితాలను మార్చేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందన్నారు.

వ్యవసాయం, నిర్మాణ రంగ సామగ్రి తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఫ్లెక్స్‌ ఇంజన్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించాలని కోరారు. హైడ్రోజన్‌ రవాణా అన్నది పెద్ద సమస్యగా పేర్కొంటూ.. ఈ విషయంలో భారత్‌ ఇంధన ఎగుమతిదారుగా అవతరించాలన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్‌ రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

Videos

ఈ జగన్ మనల్ని వదలడు.. సైలెంట్ గా ఫ్లైటెక్కి ఉస్కో !

భోగాపురం అసలు కథ ఇది.. క్రెడిట్ దొంగ చంద్రబాబు

YSRCP ఆఫీసుకు నోటీసులు.. మున్సిపల్ కమీషనర్ పై హైకోర్టు ఆగ్రహం

రాజా సాబ్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో

టీడీపీ నేతల మైకుల్లో మారుమోగిన జగన్ మంచితనం

బాబులో టెన్షన్.. జగన్ వ్యాఖ్యలపై మరో డ్రామా

సంక్రాంతి పండుగ వేళ మందు బాబులకు చంద్రబాబు షాక్

ఫార్చ్యూన్ 500కి భూమి ఫ్రీగా ఇవ్వడానికి నువ్వెవడివి కోన్ కిస్కా గొట్టం గాడివి

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

అమరావతి రైతులతో బాబు గేమ్.. YS జగన్ ఆగ్రహం

Photos

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)

+5

చంద్రబాబుది విలన్‌ క్యారెక్టర్‌.. ఆధారాలతో ఏకిపారేసిన వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

కన్నడ 'మార్క్'తో సెన్సేషన్..క్వీన్‌ ఆఫ్‌ ‘మార్క్‌’గా దీప్శిఖ చంద్రన్ (ఫొటోలు)

+5

Yash Birthday : యశ్‌ అసలు పేరేంటో తెలుసా? (ఫోటోలు)

+5

తెలంగాణలో మొదలైన ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)