క్లోజ్డ్ రూమ్ లో కన్నింగ్ ప్లాన్.. అసెంబ్లీ సాక్షిగా అంతా బాబే చేశాడు..
Breaking News
సంధ్య థియేటర్‌లో దారుణం.. వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా!
Published on Mon, 01/05/2026 - 10:15
కర్ణాటక బెంగళూరులోని సంధ్య థియేటర్‌లో దారుణం చోటు చేసుకుంది. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల విక్టరీ వెంకటేశ్ సూపర్ హిట్ మూవీ 'నువ్వు నాకు నచ్చావ్' రీరిలీజ్ అయింది. ఆదివారం రోజు బెంగళూరులోని తెలుగువారు ఈ సినిమా చూసేందుకు దగ్గర్లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు.
సీక్రెట్ కెమెరా
అయితే ఓ మహిళ లేడీస్ వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ ఎవరో సీక్రెట్ కెమెరా పెట్టి రికార్డు చేస్తున్నట్లు గుర్తించింది. వెంటనే విషయాన్ని బయటకు వచ్చి చెప్పింది. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒక అనుమానిత బాలుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. సదరు బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
చదవండి: చెల్లి పెళ్లిలో హీరో డ్యాన్స్.. ఒక్క పైసా తీసుకోలే!
Tags : 1