Breaking News

జన నాయగణ్‌ Vs పరాశక్తి.. విజయ్‌ రియాక్షన్‌ ఇదే..

Published on Mon, 01/05/2026 - 07:01

శివకార్తికేయన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ పరాశక్తి. డాన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆకాశ్‌ నిర్మించిన ఈ మూవీలో రవిమోహన్‌, అధర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 10న రిలీజవుతోంది. అయితే దీనికంటే ఒకరోజు ముందు జనవరి 9న విజయ్‌ కథానాయకుడిగా నటించిన జననాయకన్‌ మూవీ విడుదలవుతోంది.

పొంగల్‌కు సినిమా లేకపోవడంతో..
దీని గురించి శివకార్తికేయన్‌ స్పందించాడు. శనివారం సాయంత్రం చెన్నైలో పరాశక్తి మూవీ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్‌ మాట్లాడుతూ.. పరాశక్తి సినిమాను 2025 అక్టోబర్‌లో లేదా దీపావళికి విడుదల చేద్దామని నిర్మాత ఆకాశ్‌, నేను మాట్లాడుకున్నాం. అయితే విజయ్‌ మూవీ అక్టోబర్‌లో తెరపైకి రానుందని.. దీంతో పొంగల్‌కు వేరే సినిమా లేదని ప్రచారం జరగడంతో మనం పొంగల్‌కు వద్దామని ఆకాశ్‌ చెప్పారు.

తీరా అదే సమయంలో
అయితే కొన్ని రోజుల తర్వాత విజయ్‌ నటిస్తున్న జన నాయగణ్‌ మూవీ పొంగల్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే నిర్మాత ఆకాశ్‌కు ఫోన్‌ చేసి మనం రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ చేద్దామా అని అడిగాను. కానీ, అప్పటికే సినిమా రైట్స్‌ అన్నీ అమ్ముడుపోవడంతో అది కష్టమన్నాడు. తర్వాత నేను విజయ్‌ మేనేజర్‌ జగదీష్‌కు ఫోన్‌ చేసి.. జననాయగణ్‌ రిలీజ్‌ను సంక్రాంతికి మార్చారా? అని అడిగాను. అందుకాయన.. అవును, మార్చాం. అయినా ఏం పర్లేదు, రెండు సినిమాలు విజయం సాధిస్తాయి. మీ సినిమా రిలీజ్‌ చేయండి అన్నారు. 

విజయ్‌తో మాట్లాడా..
అప్పటికీ నాకు మనసు కుదుటపడక విజయ్‌తో అన్ని విషయాలు మాట్లాడాను. పొంగల్‌కు పదిరోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి రెండు సినిమాలు విడుదల చేయొచ్చని చెప్పారు. దీనివల్ల ఎవరి సినిమా ప్రభావితం కాదన్నారు. నాకు, విజయ్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. ఎవరేమనుకున్నా ఈ పొంగల్‌ అన్నాతమ్ముళ్లది. జనవరి 9న జన నాయగణ్‌ మూవీ చూడండి. 33 ఏళ్లుగా మనల్ని ఎంటర్‌టైన్‌ చేసిన వ్యక్తి చివరి సినిమాను ఆదరించండి. ఆ తర్వాతి రోజు విడుదలవుతున్న పరాశక్తిని సైతం ఆదరించండి అని పేర్కొన్నాడు.

Videos

క్లోజ్డ్ రూమ్ లో కన్నింగ్ ప్లాన్.. అసెంబ్లీ సాక్షిగా అంతా బాబే చేశాడు..

'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు

Gadikota Srikanth : రాయలసీమ ప్రాంతంపై ఎందుకింత ద్వేషం చంద్రబాబు

NEW RECORD: రూ.3 లక్షల కోట్లు దాటేసిన చంద్రబాబు అప్పులు

TVK అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు..

Tirumala: చిరంజీవి సతీమణి సురేఖకు అవమానం...పవన్ రియాక్షన్!

Mayor Rayana: మీది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం

Konasema: బయటపడుతున్న సంచలన విషయాలు..

ఏపీ-తెలంగాణ జల వివాదంపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

YSRCP Leaders: ఇది చేతగాకే.. ఓయబ్బో అని చేతులెత్తేశావ్..

Photos

+5

గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)

+5

జపనీస్ చెఫ్ స్పెషల్.. చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ! (ఫొటోలు)

+5

ఎ.ఆర్. రెహమాన్ బర్త్‌డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్‌, హర్మన్‌

+5

Sankranti 2026 : పల్లె గాలిలో రుచుల పండుగ (ఫొటోలు)

+5

కోనసీమ గుండెల్లో బ్లో అవుట్‌ మంటలు (ఫోటోలు)

+5

సందడిగా సాక్షి ముగ్గుల పోటీలు (ఫొటోలు)

+5

'వామ్మో వాయ్యో' సాంగ్.. తెర వెనక ఆషిక ఇలా (ఫొటోలు)

+5

దీపికా పదుకోణె బర్త్‌డే స్పెషల్‌.. వైరల్‌ ఫోటోలు ఇవే