క్లోజ్డ్ రూమ్ లో కన్నింగ్ ప్లాన్.. అసెంబ్లీ సాక్షిగా అంతా బాబే చేశాడు..
Breaking News
కోటి ఆశలతో కొత్త ఏడాది
Published on Mon, 01/05/2026 - 04:11
కొత్త కేలండర్ ఏడాదిలో దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ దౌడు తీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు యూటర్న్ తీసుకోవచ్చనే అంచనాలు, క్యూ3 ఫలితాలపై ఆశలు, ఊపందుకుంటున్న వినియోగం ఇందుకు దోహదపడచ్చని అంచనా. గత వారం సాంకేతిక అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడం దీనిని బలపరుస్తోంది! వివరాలు చూద్దాం..
ఈ వారం ప్రధానంగా భారత్‌సహా యూఎస్, చైనా పీఎంఐ ఇండెక్సుల గణాంకాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఆశావహ ఆటోరంగ విక్రయాలు, జోరుమీదున్న ఆర్థిక పురోగతి, పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి బలహీనతలు, వాణిజ్య టారిఫ్‌లు కొంతమేర ప్రతికూల ప్రభావానికి కారణంకాన‡ున్నాయి.
దేశీయంగా చూస్తే
→ గత నెల హెచ్‌ఎస్‌బీసీ సరీ్వసుల పీఎంఐ, కాంపోజిట్(తయారీ) పీఎంఐ తుది గణాంకాలు వెలువడనున్నాయి.
→ వచ్చే వారం ప్రారంభంకానున్న క్యూ3 కార్పొ రేట్ ఫలితాల సీజన్‌పై ఆశావహఅంచనాలున్నాయి. 12న ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అక్టోబర్–డిసెంబర్(క్యూ3) పనితీరును వెల్లడించనున్నాయి.
→ 2025లో దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా విదేశీ ఇన్వెస్టర్లు 18.9 బిలియన్ డాలర్ల(రూ. 1.66 లక్షల కోట్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఈ బాటలో 2026 తొలి రెండు రోజుల్లో సైతం నికరంగా రూ. 7,608 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే గతంలో ఇలా జరిగిన తదుపరి ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న అంశాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు.
విదేశీ అంశాలు ఇలా
→ ఈ వారం 2025 డిసెంబర్ నెలకు చైనా తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ ఇండెక్సుల వివరాలు విడుదలకానున్నాయి. విదేశీ నిల్వలు, ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. మరోవైపు వివిధ యూఎస్ గణాంకాలు వెలువడనున్నాయి.
సరికొత్త రికార్డ్
గత వారం నిఫ్టీ ఇంట్రాడేలో 26,340 పాయింట్లను తాకింది. సరికొత్త గరిష్టానికి చేరి రికార్డ్ నెలకొల్పింది. గత వారం నికరంగా సెన్సెక్స్ 721 పాయింట్లు(0.84%) పుంజుకుని 85,762 వద్ద నిలవగా.. నిఫ్టీ 286 పాయింట్లు(1.1%) ఎగసి 26,329 వద్ద స్థిరపడింది.
బుల్లిష్ వేవ్‌లో..
యూఎస్ వెనెజువెలా ప్రెసిడెంట్‌ను బందీగా పట్టుకుని స్వదేశానికి తరలించిన నేపథ్యంలో ఈ వారం అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం సైతం స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే జీడీపీ వృద్ధి, క్యూ3 ఫలితాలపై అంచనాలు, ప్రభుత్వ వ్యయాలు వంటి అంశాలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు చెబుతున్నారు. వెరసి మార్కెట్లు బలాన్ని పుంజుకునేందుకే అధికంగా వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.
→ గత వారం అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ 26,000 స్థాయికి ఎగువన నిలుస్తూ 26,340 వద్ద కొత్త గరిష్టాన్ని అందుకుంది. దీంతో ఈ వారం నిఫ్టీ 26,720– 26,900 పాయింట్ల వరకూ బలపడవచ్చు. ఒకవేళ బలహీనపడితే 26,000– 25,750 పాయింట్ల స్థాయిలో మద్దతు లభించే వీలుంది.
→ గత వారం 85,350 పాయింట్లను దాటి 85,762కు ఎగసింది. వెరసి ఈ వారం 86,800, 87,200 పాయింట్లవరకూ పురోగమించవచ్చు. ఇలాకాకుండా నీరసిస్తే 84,800– 84,000 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ కనిపించే అవకాశముంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Tags : 1