Breaking News

నాతోపాటు నవ్వారు, ఏడ్చారు.. బిగ్‌బీ భావోద్వేగం

Published on Sat, 01/03/2026 - 14:31

సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ టీవీ షోల ద్వారా వారికి మరింత దగ్గరయ్యాడు. కౌన్‌ బనేగా కరోడ్‌పతి (KBC) అనే రియాలిటీ షోకి అమితాబ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ కేబీసీ 17వ సీజన్‌ శుక్రవారం ముగిసిపోయింది. ఈ క్రమంలో చివరి ఎపిసోడ్‌ ప్రారంభంలో బిగ్‌బీ భావోద్వేగానికి లోనయ్యాడు.

అంతా నిన్ననే..
కొన్నిసార్లు మన జీవితంలోని కొన్ని క్షణాలను ఎంత గాఢంగా ఆస్వాదిస్తాం. ఆ క్షణాలు ముగింపుకు చేరుకుంటే.. అదేంటి, ఇప్పుడే కదా మొదలైంది అన్నంత బాధేస్తుంది. ప్రతీది నిన్ననే జరిగినట్లుగా ఉంటుంది. ఈరోజు చివరి ఎపిసోడ్‌.. నా మనసంతా అదోలా ఉంది. నా జీవితంలో మూడింట ఒక వంతు.. కాదు, అంతకన్నా ఎక్కువ ఈ షో ద్వారా మీ అందరితో గడిపాను. అదే నాకు దక్కిన గొప్ప అవకాశం.

థాంక్యూ సో మచ్‌
నేను ఎప్పుడు వచ్చినా మీ అందరూ సాదరంగా ఆహ్వానం పలికారు. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. ఈ ప్రయాణం మొదలైన దగ్గరి నుంచి ఆఖరు వరకు మీరంతా నాకు తోడుగా ఉన్నారు. మీరు ఇలా తోడుగా ఉన్నంతవరకు ఈ గేమ్‌ షో ఇలాగే కొనసాగుతుంది. థాంక్యూ సో మచ్‌ అని పేర్కొన్నాడు. ఆయన కామెంట్స్‌ విని అభిమానులు సైతం ఎమోషనలవుతున్నారు. మీరు షోలో ఉన్నారు కాబట్టే మేమింకా దాన్ని చూస్తున్నాం.. కేబీసీ 18వ సీజన్‌ కోసం ఎదురుచూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: మగాడిలా తయారవుతున్నావ్‌.. నటి కూతురి కౌంటర్‌

Videos

ఛానల్ బ్లాక్.. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్?

'వెనిజులా నేనే పాలిస్తా' ఇది సాధ్యమేనా? ట్రంప్ తప్పుకు భారీ శిక్ష?

ఏపీ హక్కులు తెలంగాణకు తాకట్టు! బయటపడ్డ చీకటి ఒప్పందం

ఆ నీటి హక్కు రాయలసీమకే.. సుప్రీంకోర్టులో జగన్ పిటిషన్

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి

తిరుమలలో భద్రతా వ్యవస్థ పూర్తి డొల్లగా మారింది: భూమన

2026..! రచ్చ లేపే సినిమాలు ఇవే..!

మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో గంజాయి బ్యాచ్ వీరంగం

రాజ్యాంగం అదృశ్యం కానుందా..? అసలు దేశంలో ఏం జరుగుతుంది..!

గొంతులో మందు పోసి పిసికి కిరాతకంగా.. గద్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్

Photos

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)

+5

జెట్లీ మూవీ టీజర్‌ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటే? (ఫొటోలు)

+5

కజిన్ పెళ్లిలో హృతిక్ రోషన్ సందడే సందడి (ఫొటోలు)

+5

‘సైక్‌ సిద్ధార్థ్‌’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

ఏం మాయ చేశావే!.. వెండితెరపై మరో మల్లూ సెన్సేషన్‌ (ఫొటోలు)