ప్రదీప్‌ రంగనాథన్‌ సరసన టాప్‌ హీరోయిన్‌

Published on Sat, 01/03/2026 - 09:04

కోలీవుడ్‌ యంగ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ మళ్లీ మెగా ఫోన్‌ పట్టనున్నాడు. దర్శకుడిగా తొలి చిత్రం (కోమాలి)తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ తర్వాత తను హీరోగా తెరపైకి వచ్చాడు. అలా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్‌టుడే సినిమా చేశాడు. యూత్‌ఫుల్‌ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఈ తర్వాత డ్రాగన్‌, డ్యూడ్‌ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. అయితే, మరోసారి దర్శకుడిగా ఒక భారీ చిత్రాన్ని ప్రదీప్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.

ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.  దక్షిణాదిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి.. ఇప్పుడు ప్రదీప్‌ సరసన నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందట. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి పాత్ర చాలా బలంగా ఉండనుందని టాక్‌.. ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా ఈ మూవీ నిలవనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)