ఇండియా అబ్బాయి.. జ‌పాన్ అమ్మాయి!

Published on Fri, 01/02/2026 - 20:11

వన్స్ అపాన్‌ ఏ టైమ్‌... లవ్‌ స్టోరీలు కావచ్చు... జస్ట్‌ నిన్న మొన్నటి లవ్‌స్టోరీ కావచ్చు... లవ్‌స్టోరీలు ఎప్పుడూ హాట్‌ కేకులే! తాజా విషయానికి వస్తే... బిహార్‌కు చెందిన ఇంజినీర్‌ రాహుల్‌ కుమార్‌ లవ్‌స్టోరీకీ నెటిజనులు ఫిదా అయ్యారు. ఐఐటీ గ్రాడ్యుయేట్‌ అయిన రాహుల్ జపాన్‌లోని ఆటోమొబైల్‌ కంపెనీలో పనిచేయడానికి వెళ్లాడు. టోక్యోలో జరిగిన అంతర్జాతీయ వ్యాపార సమావేశంలో జపనీయురాలైన మెరీనాతో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా, పెళ్లిగా మారింది.

‘నా జీవితంలోని కీలకమైన మలుపు టోక్యోలో జరిగిన వ్యాపార సమావేశంలో మొదలవుతుందని ఊహించలేదు. మేము మొదట స్నేహితులం. స్నేహం నమ్మకంగా పరిణామం చెందింది, ఆ నమ్మకం ప్రేమగా వికసించింది. వేరు వేరు దేశాల నుంచి వచ్చినప్పటికీ ఒకరినొకరం బాగా అర్థం చేసుకోవడంప్రారంభించాం’ అని రాశాడు రాహుల్‌.

మొదట్లో వీరి పెళ్లికి ఇరుపక్షాల పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ ఆ తరువాత పచ్చజెండా ఊపారు. పెళ్లి వేడుకలు దిల్లీలో, రిసెప్షెన్‌ దిల్లీలో జరిగింది. ఆ తరువాత వీరు బిహార్‌లోని మాదేపుర గ్రామానికి వెళ్లారు. అది రాహుల్‌ కుమార్‌ స్వగ్రామం. ‘నమస్తే ఇండియా. ఐయామ్‌ మెరీనా యాదవ్‌’ అని తనను తాను పరిచయం చేసుకున్న మెరీనా తమ లవ్‌ స్టోరీ (Love Story) ఎలా ప్రారంభమైందో వివరించింది. మొత్తానికైతే వీరి వివాహ వేడుక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

చ‌ద‌వండి: ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేక‌పోయాం
 


 

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)