శాకాహారంతో సహజ సౌందర్యం: జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Published on Fri, 01/02/2026 - 11:25

శీలంక నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ..అక్కడ వేలాది అభిమానులను సొంతం చేసుకున్నారామె. అంతేగాదు ఫ్యాషన్‌, ఫిట్‌నెస్‌ విషయంలో ఐకాన్‌. ఎప్పటికప్పడూ సోషల్‌ మీడియాలో తన ఆహారం, వ్యాయామాల గురించి నెటిజన్లతో షేర్‌ చేసుకుంటుంటారామె. అలానే ఈ సారి ఆమె తాను శాకాహారిగా మారడంతో తన బాడీలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయంటూ షేరు చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం గురించి స్వయంగా చెప్పారామె.

తాను మొక్కల ఆధారిత భోజనం తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత తన శరీరంలో చాలా మార్పులు సంతరించుకున్నాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన ముఖంలో సహజసిద్ధమైన మెరుపు రావడమే గాక మొటిమలు కూడా మాయమైపోయాయని అన్నారామె. తన చర్మ సంరక్షణ విషయంలో అద్భుతంగా ఈ డైట్‌ పనిచేసిందన్నారు. తాను మొటిమలతో చాలా ఇబ్బంది పడ్డానని, ఎప్పుడైతే శాకాహారిగా మొక్కల ఆధారితో ఫుడ్‌ని తీసుకోవడం ప్రారంభించానో అప్పటి నుంచి మొటిమలు, మచ్చలు తగ్గి కాంతిమంతంగా ఉందని తెలిపింది. 

అలాగే బరువు సైతం అదుపులో ఉంది. ఇంతకుమునుపు తగ్గుతూ..పెరుగుతూ ఉండేది. కానీ ఈ శాకాహారం మన బరువుని అద్భుతంగా అదుపులో ఉంచుతుంది. మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నమ్మకంగా చెప్పుకొచ్చారామె. అందుకు శాస్త్రీయ నిర్థారణ లేకపోయినా..పొట్ట ఉబ్బరం, బరువు విషయంలో చాలా రిలీఫ్‌ పొందానంటోంది. శరీరాని అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు అందుతాయి. 

 

ముఖ్యంగా మంచి ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. మాంసకృత్తులు సైతం మొక్కల ఆధారిత ఆహారం నుంచే పొందవచ్చని అంటుందామె. అందుకోసం కూరగాయలు, బీన్స్‌, టోపు వంటి ప్రోటీన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్నవాటిని తీసుకుంటే చాలని చెబుతోంది. అలాగే నోటి శుభ్రత కోసం ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తుంటానని, ఒక లీటరు డిటాక్స్‌నీరు తాగి హైడ్రేషన్‌గా ఉండేలా చూసుకుంటానని చెబుతోంది జాక్వెలిన్‌.

(చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్‌ రీల్స్‌తో మొదటి సంపాదన..!)
 

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)