జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
Breaking News
కొత్త జోష్ అదిరింది
Published on Fri, 01/02/2026 - 03:13
తెలుగు చిత్ర పరిశ్రమలో 2026 ఆరంభం కొత్త జోష్‌ను తీసుకొచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా తమ సినిమాల ప్రకటనలు, కొత్త అప్‌డేట్స్‌ను పంచుకున్నారు మేకర్స్. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.
⇒ గన్ పట్టుకుని మాస్ లుక్‌తో కనిపించారు చిరంజీవి. ఆయన నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నయనతార హీరో యిన్ గా నటించిన ఈ చిత్రంలో వెంకటేశ్ కీలకపాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
⇒ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్.
⇒ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్’. భూషణ్ కుమార్, క్రిషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన మరో సినిమా ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
⇒ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. ఎస్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే పవన్ కల్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న మూవీని ప్రకటించారు.
⇒ ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ది ఫ్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
⇒ శర్వానంద్ హీరోగా, సంయుక్త– సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
⇒ సుమంత్ హీరోగా నటించిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. రాజ శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌పై జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
⇒ అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని తొలిపాటని ఈ నెల 5న, మూవీని వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
⇒ నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేసింది యూనిట్.
⇒ విశ్వక్‌సేన్ హీరోగా సాయి కిరణ్ రెడ్డి దైదా దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ డ్రామాకి ‘లెగసీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఏక్తా రాథోడ్ హీరోయిన్ . యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్్సమెంట్ టీజర్‌ను గురువారం విడుదల చేశారు.
⇒ కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేశ్, ఎస్‌కేఎన్ నిర్మిస్తున్న ఈ సినిమాని వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది చిత్రయూనిట్.
⇒ నవీన్ చంద్ర, దివ్య పిళ్లై జోడీగా నటిస్తున్న చిత్రం ‘హనీ’. కరుణ కుమార్ దర్శకత్వంలో ఓవీఏ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకాలజీ వంటి అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు మేకర్స్.
⇒ హీరోయిన్ సంయుక్త నటిస్తున్న సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. కేఎమ్‌సీ యోగేష్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 75శాతం పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించి, సంయుక్త లుక్‌ని విడుదల చేశారు.
⇒ సుహాస్, శివానీ నాగారం జోడీగా నటించిన సినిమా ‘హే భగవాన్ ’. గోపీ అచ్చర దర్శకత్వంలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు.
⇒ నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియాంక, దీప్తి శ్రీరంగం ముఖ్య తారలుగా సింహాచలం గుడుపూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రుక్ష్మిణి’. నేలబల్లి కుమారి సమర్పణలో జి సినిమా బ్యానర్‌పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు.
⇒ అంకిత్ కొయ్య, మానసా చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ జాతర’. ‘సమ్మతమే’ మూవీ ఫేమ్ గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. యూజీ క్రియేషన్ ్సపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. పైన పేర్కొన్న చిత్రాలతోపాటుగా మరికొన్ని సినిమాల అప్‌డేట్స్‌ని న్యూ ఇయర్ సందర్భంగా ఆయా చిత్రాల మేకర్స్ వెల్లడించారు.
Tags : 1