Breaking News

మహేష్‌ బాబు, అతని అభిమానిపై జనసేన ఫ్యాన్స్‌ బూతులు

Published on Thu, 01/01/2026 - 13:26

ఎన్నికల సమయంలో వేదికలపై పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. ఆపై అల్లు అర్జున్‌, ప్రభాస్‌, జూ. ఎన్టీఆర్‌లు  పాన్‌ ఇండియా రేంజ్‌ హీరోలు అని, వాళ్లతో పోలిస్తే తాను చాలా చిన్న నటుడుని మాత్రమే అన్నారు.  జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫోటో ఇలా ఇవ్వండి.. ఆ ప్రభాస్‌ ఫోటో పైకి ఎత్తండి అంటూ.. ఎన్నికల ముందు ఇతర హీరోలను ఆకాశానికి  ఎత్తారు. ఇదంతా వారి ఫ్యాన్స్‌ ఓట్ల కోసం ఆయన చేసిన మ్యాజిక్‌.. కానీ, గెలిచిన తర్వాత పరిస్థితి మారింది. వారి అభిమానులపై సైకోలు మాదిరి జనసేన అభిమానులు రెచ్చిపోతున్నారు.

మహేష్‌ బాబు అభిమానిపై బూతులు
విశాఖలోని జగదాంబ సెంటర్‌లో సూప‌ర్ స్టార్ కృష్ణ‌ విగ్రహాన్ని జ‌న‌సేన‌ పార్టీ నేతలు ద‌గ్గ‌రుండి కొద్దిరోజుల క్రితమే తొలగించారు. ఆపై తాము తలుచుకుంటే ఒకే రోజులో విగ్రహాన్ని ఎత్తేశాం అంటూ  ఘట్టమనేని ఫ్యాన్స్‌ను  రెచ్చగొట్టేలా సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పడు మహేష్‌ బాబు అభిమానిపై బూతులతో జనసేన అభిమానులు రెచ్చిపోయారు.  తాజాగా జల్సా, మురారి సినిమాలు రీరిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహేష్‌ బాబు అభిమాని ఒకరు జల్సా సినిమాకు వెళ్లాడు. అయితే,  ఆ యువకుడి మెడలో వారణాసి మూవీ లాకెట్‌ ఉంది. దానిని గుర్తించిన జనసేన ఫ్యాన్స్‌ రెచ్చిపోయారు. ఆ యువకుడిని తిట్టడమే కాకుండా ఏకంగా మహేష్‌ బాబును దూషిస్తూ ఆయన్ని కూడా తిట్టాలని హుకూం జారీ చేశారు. అలా చేయకుంటే దాడిచేస్తామని చెప్పారు. 

ఈ క్రమంలో ఆ యువకుడి తల్లిని కూడా వారు తిట్టి మరింత దిగిజారిపోయారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే, నెటిజన్లు కూడా పవన్‌ ఫ్యాన్స్‌పై విరుచుకుపడుతున్నారు. 'ఇవ్వేం బూతులు రా..' అంటూ భగ్గుమంటున్నారు. ఆపై అల్లు అర్జున్‌ ఫోటో మాస్క్‌ను దరించిన కొందరు జనసేన అభిమానులు సైకోలుగా మారిపోయారు. తమ వికృత చేష్టలకు విరుగుడు లేదన్నుట్లుగా పవన్‌ అభిమానులు ఉన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ఏ హీరో ఫ్యాన్‌తో తమకు పనిలేదనే అహంకారం వారిలో కనిపిస్తోందని ఇతర హీరోల అభిమానులు అంటున్నారు.

ఇతర హీరోల అభిమానులంటే చిన్న చూపు
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది హీరోలను, వారి అభిమానులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతూనే ఉంది అనేది క్లియర్‌గా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి  'పుష్ప' సినిమాపై పవన్‌ చేసిన కామెంట్.. ఆపై జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాను ఆడించమంటూ ఏకంగా ఆయన కుటుంబంపై  రాయలేని బూతులతో ఎగబడిన  టీడీపీ ఎమ్మెల్యే, అతన్ని సపోర్ట్‌ చేసిన జనసేన అభిమానులు.. వారిని  తరుచూగా ఎగదోసే వ్యాఖ్యలు చేస్తున్న పవన్‌ కల్యాణ్‌. వీళ్ల తీరు చూస్తుంటే.. తాము అధికారంలో ఉన్నాం..  ఇక హీరోల ఫ్యాన్స్‌తో పనేంటి.. ఏదైనా ఉంటే మళ్లీ ఎన్నికల ముందు వాళ్లను కాకపట్టొచ్చులే అనేలా వారి భావన ఉంది. (మహేష్‌ బాబు అభిమానిపై జనసేన ఫ్యాన్స్‌ వాగిన   బూతులు చిన్న పిల్లలు వినకపోవడమే మంచిది)

Videos

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?

ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. పెన్ను మింగేశాడు

ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన

స్విట్జర్లాండ్ లో పెను విషాదం.. 40 మంది మృతి ..100 మందికి గాయాలు

చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!

బుజ్జితల్లి టాలీవుడ్ కు వచ్చేస్తుందా..

ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

Photos

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)