Breaking News

అల్లు శిరీష్‌ పెళ్లి ప్రకటన.. అన్నయ్య, వదినపై ప్రేమ

Published on Mon, 12/29/2025 - 13:47

నటుడు అల్లు శిరీష్‌ కొత్త ఏడాదిలో తను ప్రేమించిన  ప్రియురాలు నయనికతో  ఏడడుగులు వేయబోతున్నాడు.  అక్టోబర్‌లో వారిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తన పెళ్లి తేదీని శిరీష్‌ ప్రకటించాడు. 2026 మార్చి 6న తన పెళ్లి జరుగుతుందని ఒక పాటతో చెప్పాడు. అల్లు అయాన్‌, ఆర్హలతో కలిసి చేసిన ఒక రీల్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.

సరదాగా ఉన్న ఆ వీడియోలో బాబాయ్‌ సంగీత్‌ ఎప్పుడు అంటూ అని వారు అడగ్గా.. మనం దక్షిణాది వాళ్లం కాబట్టి అలాంటి వేడుక ఉండదని శిరీష్‌ చెప్తాడు. కానీ, పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్‌- స్నేహారెడ్డిల వివాహం కూడా 2011 మార్చి 6నే జరిగింది. సెంటిమెంట్‌తో అదే తేదీని శిరీష్‌ ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది.

అల్లు శిరీష్‌- నయనిక స్నేహం మొదలైన కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. 2023లో వరుణ్‌తేజ్‌- లావణ్యల పెళ్లి సందర్భంగా  హీరో నితిన్‌- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్‌ ఫ్రెండ్‌ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్‌ తరపున శిరీష్‌ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్‌- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది.
 

Videos

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు DAలు పెండింగ్ లో ఉన్నాయి: హరీశ్ రావు

ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..

బోగస్ మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వైఎస్ అవినాష్రెడ్డి

ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి

ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)