'మీకు నచ్చిన డ్రెస్‌ వేసుకోండి.. అంతే కానీ'.. శివాజీకి టాలీవుడ్ నిర్మాత కౌంటర్

Published on Sun, 12/28/2025 - 11:02

టాలీవుడ్ నటుడు శివాజీ వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హీరోయిన్ల డ్రెస్సులను ఉద్దేశించి ఆయన చేసిన  కామెంట్స్‌ యావత్ మహిళా లోకం ఒక్కసారిగా విరుచుకుపడింది. సినీతారలతో పాటు సామాన్యులు సైతం శివాజీపై విమర్శలు చేశారు. ఇటీవల దండోరా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తులపై వల్గర్‌ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత తాను ఆ రెండు పదాలు మాత్రమే వాడకుండా ఉండాల్సిందని సారీ చెబుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇటీవల శివాజీ కామెంట్స్‌పై కేవలం మహిళలు మాత్రమే కాదు.. నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ రాం గోపాల్ వ‍ర్మ, నటుడు ప్రకాశ్ రాజ్ శివాజీ కామెంట్స్‌పై స్పందించారు. అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు.

తాజాగా శివాజీ కామెంట్స్‌పై నిర్మాత ఎస్‌కేఎన్‌ తనదైన స్టైల్లో పంచ్‌లు వేశారు. పతంగ్ మూవీ సక్సెస్‌ మీట్‌కు హాజరైన ఎస్‌కేఎన్‌ హీరోయిన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడే హీరోయిన్‌ను చూసి మామూలు డ్రెస్‌ వేసుకొచ్చారేంటి?..మన తెలుగు అమ్మాయి కాస్తా గ్లామర్‌గా రావాల్సిందన్నారు. మన తెలుగు హీరోయిన్స్, తెలుగమ్మాయిలు మీకు ఏ డ్రెస్‌ కంఫర్ట్‌గా ఉంటే అదే వేసుకోండి.. ఏది కాన్ఫిడెంట్‌గా అదే వేసుకోండని అన్నారు. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినాల్సిన పని లేదన్నారు. ఏం జరిగినా మన మనసు మంచిదైతే బాగుంటామని.. మన ఇంటెన్షన్ బాగుంటే అంతా మంచే జరుగుతుంది.. అంతే తప్ప మన డ్రెస్సుల్లో ఉండదని పరోక్షంగా శివాజీకి కౌంటరిచ్చారు ఎస్‌కేఎన్. 
 

 

Videos

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

బ్రెజిల్ సముద్రంలో కూలిపోయిన విమానం.. పైలట్ మృతి

వంగలపూడి అనితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన కన్నబాబు

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు

తండ్రి కంటే డేంజర్.. సిగ్గు శరం ఉందా కిరణ్..

వామ్మో పెద్దపులి.. పొలాల్లో సంచారం

అమరావతి భూముల వెనుక లక్షల కోట్ల కుంభకోణం.. ఎంక్వయిరీ వేస్తే బొక్కలోకే!

మరీ ఇంత నీచమా! ఆవేదనతో రైతు చనిపోతే.. కూల్ గా కుప్పకూలాడు అని పోస్ట్

Photos

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)

+5

హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)