హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్
Breaking News
అరుదైన హిమాలయ 'సిక్కిం సుందరి'..! ప్రకృతి నేర్పే జీవిత పాఠం
Published on Fri, 12/26/2025 - 11:53
వ్యాపార దిగ్గజం ఆనంద్‌మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను, ప్రేరణ కలిగించే సంఘటనలను షేర్ చేసుకుంటుంటారు. తాజాగా ఓ ట్రావెల్‌లో చూడదగ్గ విషయలతోపాటు అక్కడ మానవులకు ప్రేరణ కలిగించే ఓ అరుదైన హిమాలయ పర్వత మొక్క గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అది పుష్పించే విధానం ప్రతి ఒక్కరిని మంత్రముగ్దుల్ని చేయడమే కాదు..ఆ కఠినమైన పర్వత ప్రాంతంలో తన మనుగడ కోసం అది చేఏ పోరాటం స్ఫూర్తిని రగిలిస్తుంది. మరి ఆ మొక్క ఎక్కడ ఉంది, దాని కథాకమామీషు ఏంటో చూసేద్దామా..!
ఆనంద్ మహింద్రా సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో "సిక్కిం సుందరి" మొక్క గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఇది అరుదైన పర్వత మొక్క అని పుష్పించేందుకు దశాబ్దాలుగా శక్తిని నిల్వచేసుకుని ఆకాశాన్నేతాకేలా పుష్పించిన విధానం చూస్తే పోతుందన్నారు. ఇది సముద్ర మట్టానికి 4,000–4,800 మీటర్ల ఎత్తులో చూసే మొక్క అట. ఈ అసాధారణ అధ్భుతాన్ని ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు మహీంద్రా.
దీన్ని"గ్లాస్‌హౌస్ ప్లాంట్"గా పేర్కొన్నారు. పర్వతాలుకు వ్యతిరేకంగా మెరస్తున్న ఓ టవర్‌లా పుష్పిస్తుందని రాశారు పోస్ట్‌లో. తనకు సిక్కిం పర్యటనలో ఈ మొక్క గొప్ప ప్రేరణగా నలిచిందని అన్నారు. దీనిని శాస్త్రీయంగా రుమ్ నోబెల్ అని పిలుస్తారని చెప్పారు. ఈ మొక్క అపారదర్శక, పగోడా లాంటి పువ్వులను కలిగి ఉంటుంది. ఆ ప్పువులు కూడా సుమారు ఏడు నుంచి 30 ఏళ్ల పెరుగుదల అనంతరం వస్తాయట. వీటి పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుందట.
శాస్త్రవేత్తలకు, పర్యాటకులకు ఇవి ఆకర్షణగానూ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మైనస్ సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉండే కఠిన వాతావరణంలో పెరిగే మొక్క. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్‌తక్కువగా, బలమైన గాలుల మధ్య పర్వాతానికి వ్యతిరేకంగా ఎత్తుగాపెరుగుతుంది.
'ఓర్పు'కి నిర్వచనం.
ఈ మొక్క పుష్పించేందుకు ఏడు నుంచి 30 ఏళ్ల వరకు చాలా నిశబ్దంగా ఆక్కుల్లో శక్తిని నిల్వ చేసుకుంటూ చిన్న రోసెట్(ఆకకుల సముహంలా) పెరుగుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా అన్నే ఏళ్ల అనంతరం ఏకంగా రెండు మీటర్లు ఎత్తుకు అమాంతం దూసుకుపోయి ఆలయాల్లో ఉండే ఎత్తైన గోపురం మాదిగా నిలబడుతుంది. ఆ తర్వాత విత్తనాలను విడుదల చేసి చనిపోతుందని మహీంద్రా పోస్ట్‌లో రాసుకొచ్చారు.
అయితే పర్యాటకులు దీన్ని చూడటం కష్టమని అన్నారు. ఎందుకంటే ఎత్తైన పర్వతాల్లో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రదేశంలో ఉండటం వల్ల చూడటం కష్టమని చెప్పుకొచ్చారు. అంతేగాదు సిక్కిం టూర్‌లో ఇలాంటి ఎన్నో ప్రకృతి కమనీయ దృశ్యాలను తిలకిస్తామని అన్నారు. మంచుతో కప్పబడి ఉండే ఎత్తైన కాంచన్‌జంగా పర్వతం దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయన్నారు. అంతేగాదు ఈ సిక్కిం అద్భుతైన మంచు సరస్సులకు నిలయం అని, ఇక్కడ రుంటెక్, పెమాయాంగ్ట్సే, లాబ్రాంగ్ వంటివి పురాతన బౌద్ధానికి నిలయంగా ఉంటాయన్నారు.
సిక్కిం పర్యటనకు అనుకూలమైన సమయం..
మార్చి–జూన్: ఈ సమయంలో, సిక్కిం ఆహ్లాదకరమైన వాతావరణం, స్పష్టమైన ఆకాశం, రంగురంగుల పుష్పాలను ఆస్వాదించొచ్చు. ఇది ప్రకృతి నడకలకు సరైన సమయం.
సెప్టెంబర్–డిసెంబర్: ఈ సమయంలో, సిక్కిం చల్లని, పొడి పరిస్థితుల వాతావరణం ఉంటుంది. ఇక కాంచన్‌జంగా శ్రేణి అతీంద్రియ దృశ్యాలను అందిస్తుంది.
డిసెంబర్–ఫిబ్రవరి: ఇసిక్కిం మంచుతో కూడిన అద్భుత భూమిగా మారే సమయం ఇది.
I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’
Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains.
Its life is a masterclass in patience.
It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl— anand mahindra (@anandmahindra) December 21, 2025
(చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్)
Tags : 1