వాటే ట్రయల్‌ రూమ్‌..! ఆ వైబ్స్‌కి ఫిదా అవ్వాల్సిందే..

Published on Mon, 12/22/2025 - 17:26

సాధారణంగా మాల్స్‌లో ట్రయల్‌ రూమ్స్‌ ఎలా ఉంటాయో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ట్రయల్‌ రూమ్‌ మాత్రం అస్సలు చూసుండే ఛాన్సే లేదు. పైగా ఒక్కసారి అందులోకి ఎంటర్‌ అయితే..బయటకు రావడం చాలా కష్టమట. చెప్పాలంటే అస్సలు వదిలపెట్టి రాబుద్ధి కాదట.అబ్బా అంత స్పెషాలిటి ఏముంది అనుకుంటున్నారా..!.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సార్థక్ సచ్‌దేవా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అది చూస్తే దుబాయ్‌లో ట్రయల్ రూమ్స్‌ ఇలా ఉంటాయా అనిపిస్తుంది. ఆ వీడియోలో దుబాయ్‌లోని H&M స్టోర్‌లోని హైటెక్ ట్రయల్ రూమ్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు సార్థక్ సచ్‌దేవా. చక్కటి మ్యూజిక్‌ని వింటూ డ్రెస్‌ మార్చుకోవచ్చు. అంతేగాదు అక్కడ ముందు ఉన్న టచ్‌స్క్రీన్‌ ప్యానెల్‌లో హైప్, వైబ్, చిల్, లోకల్ అనే నాలుగు రకాల సంగీత శైలిని అందిస్తుంది. 

వాటిలో మనకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకున్నాక..మొత్తం ట్రయల్‌ రూమ్‌  మ్యూజిక్‌ పరంగానే కాదు రూమ్‌ వ్యూ కూడా మారిపోతుంది. ఇక లోపలి గది గోడలు స్క్రీన్‌లతో ఉంటాయి.  ఇందులోని డైనమిక్ విజువల్స్, కదిలే నమునాలు మనం ఎంచుకున్న సంగీతానికి  అనుగుణంగా గది అంతా లైటింగ్‌ని ప్రొజెక్ట్‌ చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే..ఆ గది హంగుఆర్భాటం, మంచి సంగీతానికి అందులోనే లీనమై ఉండిపోయేలా చేస్తుంది.

అందుకు సంబంధించిన వీడియోకి “దుబాయ్‌లో వైరల్ డ్రెస్సింగ్ రూమ్!” అనే క్యాప్షన్‌ ఇచ్చి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి..ఇలాంటి ట్రయల్ రూమ్‌ అయితే అక్కడే ఉండిపోతా అంటూ కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఆ ప్యాలెస్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఇంత ఖరీదా..? పీవీ సింధు ఏకంగా రూ. 7 లక్షలు..)
 

#

Tags : 1

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)