సెట్‌లో నేనొక్కదాన్నే మహిళని.. 'సైజ్' అని ఇ‍బ్బంది పెట్టారు: రాధిక ఆప్టే

Published on Sat, 12/20/2025 - 15:43

ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు.. చాలా విషయాల్లో స్ట్రెయిట్‌గా చెప్పలేరు. తమకు ఎదురైన చేదు అనుభవాల్ని కూడా బయటపెట్టేందుకు ఇష్టపడరు. కానీ రాధికా ఆప్టే మాత్రం ధైర్యంగా చెబుతుంది. ఇ‍ప్పుడు కూడా దక్షిణాదిలో తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని రివీల్ చేసింది. రీసెంట్‌గా 'సాలీ మహబ్బత్' అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ వాఖ్యలు చేసింది.

'ఇండస్ట్రీలో పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. చాలా గుర్తింపు ఉన్న వ్యక్తుల నుంచి ఆఫర్స్ వచ్చినప్పుడు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. పైకి హుందాగా కనిపిస్తారు. కానీ కలిసిన తర్వాత వాళ్ల నిజస్వరూపాలు ఏంటనేవి అర్థమయ్యాయి. బాలీవుడ్, సౌత్.. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటివి ఉన్నాయి. నేను గతంలో కొన్ని సౌత్ మూవీస్ చేశారు. ఓ సినిమా సెట్‌లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను.'

'ఓ  మారుమూల పల్లెలో షూటింగ్ చేస్తున్నం. చూస్తే నేనొక్కదాన్నే మహిళని. వాళ్లకు నా బ్యాక్, రొమ్ము  పెద్దగా కనిపించాలి. దీంతో 'అమ్మ ప్యాడింగ్ చేయండి.. ఇంకా ప్యాడింగ్ చేయండి' అని విసిగించారు. నాకా చాలా కోపం వచ్చింది. నా స్థానంలో మీ అమ్మో, చెల్లిలో ఉంటే ఇలానే చెబుతావా.. ప్యాడింగ్ చెయ్ ప్యాడింగ్ చెయ్ అని అంటావా' అని అరిచేశాను. అలా ఏం చేయనని చెప్పేశాను. ఆ రోజు నాకు మేనేజర్ లేడు, ఏజెంట్ లేడు. నాకంటూ ఓ టీమ్‌ లేదు.. ఆ అనుభవం తర్వాత మళ్లీ సౌత్ సినిమాలు చేయాలంటేనే భయం వేసింది' రాధిక ఆప్టే చెప్పింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే.. ఓ దక్షిణాది సీనియర్ హీరో కూడా గతంలో తనతో సెట్స్‌లో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. డబ్బుల కోసం ఆ హీరోతో మరో సినిమా చేయాల్సి కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది. రాధిక సౌత్ మూవీస్ విషయానికొస్తే.. 'రక్తచరిత్ర'తో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. తమిళంలో 'కబాలి'తో పాటు పలు సినిమాలు చేసింది.

Videos

ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు

సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే

వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ

హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు

బీజేపీలో చేరిన సినీ నటి ఆమని

హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!

జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది

ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు

గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

కోతుల కోసం చింపాంజీ ఐడియా

Photos

+5

పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)

+5

భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌.. అరుదైన (రేర్‌) ఫొటోలు

+5

ఏపీవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ ముందస్తు బర్త్‌ డే వేడుకలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)

+5

శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)

+5

రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)

+5

క్రిస్మస్ వేళ.. ఏపీలోని ఈ ప్రసిద్ధ చర్చి గురించి తెలుసా? (ఫొటోలు)