రేసులో 'అవతార్'.. కానీ 'ధురంధర్' కలెక్షనే ఎక్కువ!

Published on Sat, 12/20/2025 - 14:46

విడుదలై రెండు వారాలు దాటిపోయినా సరే 'ధురంధర్' జోరు అస్సలు తగ్గట్లేదు. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ దేశవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రూ.600-700 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా థియేటర్లలోకి వచ్చిన హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీని కూడా వసూళ్లలో ఈ చిత్రం దాటేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్' ఫ్రాంచైజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2009లో తొలి పార్ట్ రిలీజైనప్పుడు మూవీ లవర్స్ ఆశ్చర్యపోయారు. మన దేశంలోనూ వేల కోట్ల వసూళ్లు వచ్చాయి. 2022లో రెండు పార్ట్ విడుదలైతే ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే దక్కింది. రూ.400-500 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. కానీ నిన్న(డిసెంబరు 19) థియేటర్లలోకి మూడో పార్ట్‌కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. అదే స్టోరీ అదే విజువల్స్ ఉన్నాయని చూసొచ్చిన ఆడియెన్స్ అనుకుంటున్నారు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.20 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.

అదే టైంలో 'ధురంధర్'కి నిన్న(డిసెంబరు 19) రూ.22.50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే రేసులో ఉన్న హాలీవుడ్ మూవీ 'అవతార్ 3'ని కూడా హిందీ మూవీ దాటేసిందనమాట. చూస్తుంటే ఈ వీకెండ్‌లోనూ 'ధురంధర్' హవా కనిపించేలా ఉంది. ఈ మూవీ దెబ్బకు ఇటు తెలుగులో రిలీజైన 'అఖండ 2'పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే తెలుగు తప్ప మిగతా ఏ భాషలోనూ బాలకృష్ణ చిత్రం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అలా 'ధురంధర్' ఎఫెక్ట్.. తెలుగు, ఇంగ్లీష్ మూవీస్‌పై గట్టిగానే పడినట్లు తెలుస్తోంది.

Videos

ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు

సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే

వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ

హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు

బీజేపీలో చేరిన సినీ నటి ఆమని

హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!

జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది

ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు

గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

కోతుల కోసం చింపాంజీ ఐడియా

Photos

+5

జగన్‌ మావయ్యతో క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)

+5

భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌.. అరుదైన (రేర్‌) ఫొటోలు

+5

ఏపీవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ ముందస్తు బర్త్‌ డే వేడుకలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)

+5

శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)

+5

రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)