Breaking News

నా కూతురిని హీరోయిన్‌ చేస్తా: దేవయాని

Published on Sat, 12/20/2025 - 08:04

తమిళ చిత్ర పరిశ్రమలో మరో వారసురాలు కథానాయకిగా పరిచయం అవ్వడానికి సిద్ధం అవుతున్నారా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. కోలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ దంపతులుగా రాణిస్తున్న అతి కొద్ది జంటల్లో దర్శకుడు రాజకుమార్, దేవయాని. నటి దేవయాని గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం ఉండదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ కథానాయకిగా రాణించారు. ఈమె దర్శకుడు రాజకుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. కాగా దర్శకుడు రాజకుమార్‌ అజిత్, పార్తీపన్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన నీ వరువాయా ఎన్నా అనే సూపర్‌ హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. 

ఆ తరువాత కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆపై దర్శకుడిగా చిత్రాలు చేయకపోయినా నటిస్తున్నారు. ఈయన తన పెద్ద కూతురు ఇనియను కథానాయకిగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఆయన ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ తన పెద్ద కూతురు ఇనియను  హీరోయిన్‌గా పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అయితే అందులో నటుడు విజయ్‌ వారసుడు జెసన్‌ సంజయ్‌ను హీరోగా నటింపజేస్తానని చెప్పారు. 

నటుడు విజయ్‌తో చిత్రం చేసే అవకాశం రాలేదు అనీ, ఆయన వారసుడితోనైనా చిత్రం చేస్తానని చెప్పారు. జెసన్‌ సంజయ్, ఇనియ జంటగా నటించే చిత్రం కథను రెడీ చేసినట్లు చెప్పారు. అది నీరులా ఎన్పా చిత్రానికి సీక్వెల్‌ అని రాజకుమార్‌ చెప్పారు. జెసన్‌ సంజయ్‌ ప్రస్తుతం దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. మరి రాజకుమార్‌ కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.  

Videos

ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు

సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే

వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ

హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు

బీజేపీలో చేరిన సినీ నటి ఆమని

హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!

జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది

ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు

గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

కోతుల కోసం చింపాంజీ ఐడియా

Photos

+5

జగన్‌ మావయ్యతో క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)

+5

భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌.. అరుదైన (రేర్‌) ఫొటోలు

+5

ఏపీవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ ముందస్తు బర్త్‌ డే వేడుకలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)

+5

శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)

+5

రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)