ఆస్ట్రేలియా లో కాల్పులు.. 10 మంది మృతి
Breaking News
దసరా సూపర్ హిట్ కాంబో.. స్పెషల్ వీడియో రిలీజ్
Published on Sun, 12/14/2025 - 12:15
దసరా బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని మరోసారి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో జతకట్టారు. వీరిద్దరి కాంబో వస్తోన్న మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ సూపర్ హిట్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఇవాళ దర్శకుడు శ్రీకాంత్ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ది ప్యారడైజ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఈ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. 'రక్తం పడిన తర్వాత చరిత్ర ఓపెన్ అవుతుంది' అని చెబుతూ.. ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలో చూపిస్తూ డైరెక్టర్ కనిపించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదల చేయనున్నారు.
Tags : 1