Breaking News

డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్‌ రేంజ్‌కు!

Published on Fri, 12/12/2025 - 15:38

ఎన్నో స్ఫూర్తిదాయకమైన స్టోరీలు చూస్తుంటాం. ఎంతవరకు ప్రేరణగా భావిస్తామో తెలియదు గానీ, మన కళ్లముందే డెవలప్‌ అవుతున్న వాళ్లను బొత్తిగా గమనించం. కనీసం వాళ్లను చూసినా.. సక్సెస్‌ని ఒడిసిపట్టుకోవడం ఎలాగో తెలుస్తుంది. అందుకు ఉదాహరణ ఈవిద్యార్థి.

జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఒకప్పుడు బ్లింకిట్‌లో డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన ఉద్యోగి గురించి సోషల్‌ మీడియాలో ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఆయన ఆ పోస్ట్‌లో విద్యార్థి దృఢ సంకల్పాన్ని, ఆహార సాంకేతికత పర్యావరణ వ్యవస్థ సృష్టించిన అవకాశాలను ప్రశంసించారు. గోయల్‌ తన పోస్ట్‌లో బ్లింకిట్‌ ఉద్యోగి అథర్వ్‌ సింగ్‌ తండ్రి మద్దతు లేకుండా విద్య, జీవన ఖర్చుల కోసం ఎలా నిధులను సమకూర్చుకుంటున్నాడో వివరించారు. 

ఇది చూశాక తాను ఏమి సంపాదించలేని సమయం చాలానే ఉంది కదా అని నా జీవితం ప్రశ్నిస్తున్నట్లు అనిపించిందని గోయల్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేగాదు ఆ వ్యక్తి పరిస్థితి మెరుగుపడింది బ్లింకిట్ నియామకం గురించి ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన చూశాకేనని అన్నారు. అప్పటి నుంచి ఆ విద్యార్థి జీవితం దినదినాభి వృద్ది చెందుతూనే ఉందని పోస్ట్‌లో వెల్లడించారు గోయల్‌. 

ఒక పక్క కాలేజ్‌లో డిజైన్‌ కోర్సు చదువుతూ బ్లింకిట్‌లో డెలివరి బాయ్‌గా పని చేసిన ఆ అబ్బాయి ఇవాళ జొమాటో డిజైన్‌ బృందంలో చేరేందుకు సన్నద్ధమవుతున్నాడంటూ ఆయన పోస్ట్‌ని ముగించారు. 

ఇది నిజంగా గ్రేట్‌ కదా..ఒకప్పుడు డెలివరీల చేసిన అబ్బాయే ..డిజైన్‌ చేసే స్థాయికి అంటే చాలా స్ఫూర్తిదాయకమైన జర్నీ కదూ ఇది. క్షణాల్లో వైరల్‌ అయిన ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు చాలా అమ్యూలమైన పాఠాన్ని అందించింది ఈ స్టోరీ అని కొందరూ, ఇలాంటి సక్సెస్‌ స్టోరీలు మనకు ఆకాశమే హద్దు అని అనిపించేలా చేస్తాయి అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: రాబందుల గూళ్లలో 750 ఏళ్ల నాటి పురాతన చెప్పులు..! విస్తుపోయిన శాస్త్రవేత్తలు)

 

Videos

‘మధ్యలో ఏంటి బాసూ’ గజరాజుకు కోపం వచ్చింది

ఆరు నూరు కాదు.. నూరు ఆరు కాదు.. పెమ్మసానికి అంబటి దిమ్మతిరిగే కౌంటర్

సర్పంచ్ అభ్యర్థుల పరేషాన్

ఇకపై మంచి పాత్రలు చేస్తా

హోటల్ లో టమాటా సాస్ తింటున్నారా జాగ్రత్త!

ఘరానా మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. 25 కోట్లు గోల్ మాల్

నేనింతే.. అదో టైప్.. నిజం చెప్పను.. అబద్దాలు ఆపను..

టెండర్లలో గోల్ మాల్.. కి.మీ.కు ₹180 కోట్లు !

మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్య

కోల్ కతాలో హైటెన్షన్.. స్టేడియం తుక్కు తుక్కు

Photos

+5

మెస్సీ మ్యాచ్‌.. ఫ్యాన్స్‌ జోష్‌! (ఫొటోలు)

+5

18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)

+5

మ్యాచ్ ఆడ‌కుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ ర‌చ్చ‌ (ఫోటోలు)

+5

రజనీకాంత్ బర్త్ డే.. వింటేజ్ జ్ఞాపకాలు షేర్ చేసిన సుమలత (ఫొటోలు)

+5

గ్లామరస్ మెరుపు తీగలా యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

చీరలో ట్రెడిషనల్‌ లుక్‌లో అనసూయ.. ఫోటోలు వైరల్‌

+5

కోల్‌కతాలో మెస్సీ మాయ‌.. (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (ఫొటోలు)

+5

#RekhaNirosha : నటి రేఖా నిరోషా బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

ఇంద్రకీలాద్రి : రెండో రోజు దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు (ఫొటోలు)