రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం
Breaking News
కుదుటపడుతున్న ఇండిగో సంక్షోభం..
Published on Wed, 12/10/2025 - 11:02
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం మెల్లగా కుదుటపడుతోంది. విమానాల సర్వీసుల రద్దు, ఆపరేషనల్ ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తూ విమానాశ్రయాల్లో ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఇండిగో నిర్వహణ, పైలట్ల లభ్యత సమస్యలు, టెక్నికల్ తనిఖీలు వంటి అంశాలను పరిశీలించేందుకు డీజీసీఏ ప్రత్యేక బృందాలను నియమించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సంస్థపై ఒత్తిడిని మరింత పెంచుతూ విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో మొత్తం ఆపరేషన్లలో 10 శాతాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇండిగో సుమారు 200 విమాన సర్వీసులు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సంస్థను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా, ఇండిగోకు కేటాయించిన కొన్ని రూట్లను రద్దు చేసే యోచనలో కూడా డీజీసీఏ ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వీసుల నిరంతరత, భద్రతా ప్రమాణాలు, సిబ్బంది లభ్యత వంటి అంశాల ఆధారంగా రూట్లను పునర్వ్యవస్తీకరించనున్నట్లు సమాచారం.
ఈ పరిణామాలతో ఇండిగో సంక్షోభం క్రమంగా కుదుటపడుతున్నప్పటికీ, విస్తృతంగా సేవలు అందించే సంస్థగా ఉన్నందున మరికొన్ని రోజులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని విమానయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Tags : 1