హైదరాబాద్‌లో లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ల విస్తరణ

Published on Tue, 12/09/2025 - 19:22

గ్లోబల్ స్కిల్లింగ్ అండ్ లెర్నింగ్ విభాగంలో సర్వీసులు అందిస్తున్న అప్‌గ్రాడ్ (upGrad) హైదరాబాద్‌లో రెండు కొత్త లెర్నింగ్ సపోర్ట్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. దీని ద్వారా ‘ఫిజిటల్’(ఫిజికల్ + డిజిటల్) లెర్నింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ విస్తరణ పెరుగుతున్న టెక్నాలజీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లలో నైపుణ్యాల డిమాండ్‌ను తీర్చేందుకు ఉపయోగపడుతందని కంపెనీ తెలిపింది.

అప్‌గ్రాడ్ ఇప్పటికే పుణె, కోల్‌కతా, ఇండోర్, భోపాల్, బెంగళూరు వంటి నగరాల్లో 11 ఆపరేషనల్ కేంద్రాలను స్థాపించినట్లు చెప్పింది. హైదరాబాద్ ఇప్పుడు ఈ నెట్‌వర్క్‌లో కీలక ప్రాంతమని పేర్కొంది. కంపెనీ తన విస్తరణ రోడ్‌మ్యాప్‌లో భాగంగా మార్చి 2026 నాటికి ఈ నెట్‌వర్క్‌ను 40 కేంద్రాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. మెట్రో నగరాలతో పాటు టైర్-2 నగరాల్లో అత్యుత్తమ హైబ్రిడ్ లెర్నింగ్‌ను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది.

ఏఐ, మిషన్‌ లెర్నింగ్‌, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా సైన్స్‌లో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌తో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పింది. ఈ నేపథ్యంలో అప్‌గ్రాడ్ కొత్త కేంద్రాలు నగరంలోని గ్రాడ్యుయేట్లకు నైపుణ్యాలను అందించాలని నిర్ణయించింది. కంపెసీ సీఓఓ మనీష్ కల్రా మాట్లాడుతూ ‘ఏటా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు శ్రామిక శక్తిలోకి ప్రవేశించినప్పటికీ యాజమాన్యాలు ఆశించే నైపుణ్యాలకు, సాంప్రదాయ సంస్థలు అందించే వాటికి మధ్య అంతరం విస్తృతంగా ఉంది. దాన్ని పూడ్చేందుకు మా కేంద్రాలు ఎంతో తోడ్పడుతాయి’ అన్నారు.

ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ

Videos

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం

ఇండిగోకు DGCA షాక్

Florida : కారుపై ల్యాండ్ అయిన విమానం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు

నారాయణ కాలేజీలో.. వేధింపులు భరించలేక విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న వైఎస్ జగన్

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తూనే విద్యార్థుల డిమాండ్లు

KSR Live Show : సాక్షి ఛానల్ ను ఎలా బ్లాక్ చేస్తారు?

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

Photos

+5

విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)

+5

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)