అంతరిక్షంలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్లు

Published on Tue, 12/09/2025 - 16:17

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్‌తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్‌ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్‌ సన్‌క్యాచర్‌’(Project Suncatcher)గా పేరు పెట్టింది.

ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్‌లో మూన్ షాట్‌లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్‌లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.

2027లో తొలి పరీక్షలు

ఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్‌లను శాటిలైట్‌ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్‌ఫాం‌మ్‌లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.

ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది?

Videos

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం

ఇండిగోకు DGCA షాక్

Florida : కారుపై ల్యాండ్ అయిన విమానం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు

నారాయణ కాలేజీలో.. వేధింపులు భరించలేక విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న వైఎస్ జగన్

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తూనే విద్యార్థుల డిమాండ్లు

KSR Live Show : సాక్షి ఛానల్ ను ఎలా బ్లాక్ చేస్తారు?

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

Photos

+5

విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)

+5

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)