Breaking News

దేశీయంగా రేర్‌ ఎర్త్‌ తయారీకి దన్ను 

Published on Thu, 11/27/2025 - 06:26

న్యూఢిల్లీ: రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్ల ఉత్పత్తి కోసం ఉద్దేశించిన రూ. 7,280 కోట్ల స్కీముతో దేశీయంగా వాటి తయారీకి, సరఫరాకి ఊతం లభిస్తుందని పరిశ్రమ ధీమా వ్యక్తం చేసింది. తవ్వకం, వెలికితీత, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ప్రాసెసింగ్, వివిధ రంగాలకు అవసరమయ్యే మ్యాగ్నెట్ల తయారీ వ్యవస్థకు ఈ పథకంతో గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భారతీయ ఖనిజ పరిశ్రమ సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఎంఐ పర్కొంది. దేశ వ్యూహాత్మక తయారీ సామర్థ్యాలను పటిష్టం చేసేందుకు ఈ ప్రోత్సాహక స్కీము తోడ్పడుతుందని అసోచాం సెక్రటరీ జనరల్‌ మనీష్‌ సింఘాల్‌ తెలిపారు. 

ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, ఎల్రక్టానిక్స్, మెడికల్‌ డివైజ్‌లు, పునరుత్పాదక విద్యుత్, రక్షణ తదితర రంగాల వృద్ధిపై భారత్‌ ప్రధానంగా దృష్టి పెడుతున్న పరిస్థితుల్లో వార్షికంగా 6,000 టన్నుల (ఎంటీపీఏ) రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్ల తయారీ సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు ప్రయతి్నంచడమనేది సకాలంలో తీసుకుంటున్న చర్యగా ఆయన అభివరి్ణంచారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని, భవిష్యత్‌ టెక్నాలజీల అభివృద్ధిలో భారత్‌ మరింత ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుందని సింఘాల్‌ వివరించారు. దీనితో మైనింగ్, ప్రాసెసింగ్, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ తదితర విభాగాలవ్యాప్తంగా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఈవై ఇండియా పార్ట్‌నర్‌ రాజు కుమార్‌ తెలిపారు.   
 

Videos

అనంతపురం జిల్లాలో దారుణం.. కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య..

తుఫాన్ అలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా

మసిబొగ్గుల్లా భవనాలు.. మంటల్లో 300 మంది

అనుచరులతో మా ఇంటికొచ్చి..! బాధితురాలు సంచలన నిజాలు

మహిళ అని కూడా చూడకుండా చీర పట్టుకొని లాక్కెళ్లి.. కాళ్లతో తన్నుతూ..!!

దళారుల రాజ్యం! ధాన్యం కొనుగోలు గందరగోళం

నా ప్రాణాలు పోయినా.. నిన్ను మాత్రం.. కోటంరెడ్డికి నెల్లూరు మేయర్ భర్త ఛాలెంజ్

రోడ్ల మరమ్మతు పేరుతో కోట్లలో డబ్బు.. బాదుడే బాదుడు

డ్రగ్స్ ముఠాను చిత్తుచేసేందుకు ఈగల్ టీమ్ బిగ్ ప్లాన్

హాంగ్ కాంగ్ అగ్ని ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Photos

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం (ఫొటోలు)