Breaking News

పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్‌ఆర్టీసీ సేవలకు అనుమతి

Published on Wed, 11/26/2025 - 16:48

సాక్షి శబరిమల: పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్‌ఆర్టీసీ బస్ సర్వీసులకు అనుమతి లభించింది. ఈ మేరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చారు. ముఖ్యంగా తమిళనాడులో ఏడు కేంద్రాలకు కొత్త సర్వీసులు అనుమతించగా, మొత్తం 67 బస్సులకు అనుమతులు లభించినట్లయ్యింది. వాటిలో చెన్నై, కోయంబత్తూర్, పళని, తేంకాశి, కన్యాకుమారి, కంబం, తిరునెల్వేలి తదితర ఏడు ప్రాంతాలలో త్వరలో సర్వీసులు ప్రారంభంకానున్నాయి.

అలాగే కర్ణాటకలోని బెంగళూరుకు కూడా కొత్త సర్వీసు ప్రారంభంకానుంది. శబరిమల అయ్యప్ప సన్నిధానం తెరుచుకుని వారం రోజులు కావడంతో..ఈ నేపథ్యంలోనే కేఎస్‌ఆర్టీసీ శబరిమలకు వచ్చే యాత్రికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు పంపాకు వెళ్లి-రావడానికి యాత్రికుల కోసం సుమారు  3,710 సర్వీసులు నడిపింది. 

గత ఆదివారం నాటికి రికార్డు స్థాయిలో రూ. 4 కోట్లుపైన ఆదాయం రావడం విశేషం. ఇక పంపా నుంచి నిలక్కల్‌కు  1,831 సర్వీసులు నడపగా, వివిధ ప్రాంతాల నుంచి 1,879 బస్సులు పంపాకు చేరాయి. నిలక్కల్–పంపా చైన్ సర్వీసులు కూడా విజయవంతంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 15,860 చైన్ సర్వీసులు నిర్వహించారు. అంతేగాదు చెంగన్నూరు, ఎర్నాకుళం, కోట్టాయం, తిరువనంతపురం వంటి ప్రాంతాలకు ఎక్కువ బస్సులు నడుస్తున్నాయి. 

మొత్తం 15 బస్ స్టేషన్ల నుంచి 502 బస్సులు పంపాకు ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. అలాగే వీటితోపాటు కేఎస్‌ఆర్టీసి అంబులెన్స్ వాన్ కూడా సేవలందించేందుకు అందుబాటులో ఉంది. కాగా, ఈ సీజన్‌ ప్రారంభమైన వారం రోజుల్లోనే ఆరున్నర లక్షలకు పైగా యాత్రికులు ఈ కేఎస్‌ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. పైగా ఈసారి పంపా డ్యూటీకి కూడా ఆసక్తి ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా మద్యం అలవాటు లేనివారిని, పనితీరు నిరూపించుకునేవారినే నియమించింది.

(చదవండి: ఇలా బుక్‌ చేసుకుంటే.. కన్నిస్వాములకు శబరిమల యాత్ర ఉచితం..!)

 

Videos

పంచాయతీ పనులు చేయొద్దంటూ నన్ను బెదిరిస్తున్నారు! సర్పంచ్ సెల్ఫీ వీడియో

లక్కుంటేనే దర్శనమా?

మార్కెట్ కు కొత్త జోష్.. నిఫ్టీ సరికొత్త రికార్డ్

దళిత IPSలపై వివక్ష.. CID చీఫ్ కు నోటీసులు

ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే.. పదేళ్ల జైలు శిక్ష..!

క్లైమాక్స్ కు కుర్చీ వార్!

అనంతపురం జిల్లాలో దారుణం.. కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య..

తుఫాన్ అలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా

మసిబొగ్గుల్లా భవనాలు.. మంటల్లో 300 మంది

అనుచరులతో మా ఇంటికొచ్చి..! బాధితురాలు సంచలన నిజాలు

Photos

+5

స్వామి అయ్యప్ప పడిపూజలో వితికా షేరు దంపతులు

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)