పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు
Breaking News
తెరపై ముద్దు.. ఎలా ఉంటుందో చెప్పిన నటి!
Published on Sat, 11/22/2025 - 14:27
ఇది సోషల్ మీడియా యుగం. ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో తెలియదు. అసలు ఎందుకు ట్రెండ్ అవుతారనే విషయం చెప్పడం కూడా కష్టమే. గత 15 రోజులుగా ఓ నటి పేరు నెట్టింట మారుమోగుతుంది. ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. ఒకే ఒక ఇంటర్వ్యూతో వచ్చింది. ఆ ట్రెండింగ్ బ్యూటీ ఎవరోకాదు మరాఠీ ముద్దుగుమ్మ గిరిజా ఓక్(Girija Oak). ఓ సినిమా కోసం గుల్షన్ దేవయ్యతో రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు జరిగిన ఓ ఫన్నీ ఇన్నిడెంట్‌ని షేర్ చేసుకోవడంతో గిరిజా పేరు నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంత వైరల్ అవుతుందని ఆమె కూడా ఊహించలేదు. ఆ ఇంటర్వ్యూ తర్వాత గిరిజాకు సంబంధించిన ఓ కిస్ సీన్ కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ లిప్‌లాక్ సీన్ గురించి కూడా స్పందించారు గిరిజా. ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న ఆమెకు ముద్దు సన్నివేశాలు ఎలా షూట్ చేస్తారు? రొమాంటిక్ సీన్ల షూటింగ్‌కి ప్రత్యేకమైన నైపుణ్యం ఏమైనా అవసరం ఉంటుందా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి గిరిజా సమాధానం ఇస్తూ.. అదంతా మెకానికల్‌గా ఉంటుంది తప్ప..నిజమైన భావాలకు ఏమాత్రం చోటు ఉండదని స్పష్టం చేసిది.
‘షూటింగ్ సమయంలో సౌండ్‌కి ఇబ్బంది అవుతుందని ఏసీలను సైతం ఆఫ్ చేస్తారు. చెమటలు కారుతూనే ఉంటాయి. ఒకరు వచ్చి చెమటలు తూడుస్తుంటారు. మరొకరు వచ్చి హెయిర్‌ని సెట్ చేస్తుంటారు. ఇంకోవైపు లైట్ సరిగా పడడం లేదంటూ థర్మాకోల్ తీసుకొస్తారు.. ఇలా ఇన్ని కళ్లు చూస్తున్నప్పుడు రొమాన్స్ ఎక్కడ నుంచి వస్తుంది? అదంతా మెకానికల్, టెక్నికల్ ప్రాసెస్ మాత్రమే. ఆ సీన్లు షూట్ చేసేటప్పుడు హీరో ముఖం కంటే ఎక్కువగా సౌండ్ ఇంజనీరింగ్ ముఖమే గుర్తుకు వస్తుంది’ అని నవ్వుతూ చెప్పింది గిరిజా.
ఇక ముద్దు సీన్ గురించి మాట్లాడుతూ.. తెరపై కిస్ అంటే.. కార్ట్‌బోర్డ్‌ని ముద్దు పెట్టుకున్నట్లే ఉంటుందని చెప్పింది. క్లోజప్ సీన్స్ తీసేటప్పుడు ఎదుటివాడు అక్కడ ఉండడు కూడా. కెమెరాని చూస్తూనే నటించాల్సి ఉంటుంది. అక్కడ ఏ మాత్రం ఎమోషన్ ఉండదు. చాలా సార్లు నేను కెమెరా దగ్గర ఉన్న ఒక స్టాండ్ లేదా థర్మాకోల్ ముక్కను చూస్తూ రొమాంటిక్ డైలాగులు చెప్పాను’ అని గిరిజా చెప్పుకొచ్చింది.
ఎవరీ గిరిజా?
స్వతహాగా మరాఠీ నటి అయిన గిరిజా ఓక్.. హిందీలోనూ పలు మూవీస్ చేసింది. బాలీవుడ్‌లో 'తారే జమీన్ పర్' ఈమె మొదటి సినిమా. ఆ తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ(2010), కాలా, జవాన్ (2023) చిత్రాలు చేసింది. రీసెంట్‌గా ఓటీటీలో రిలీజైన ఇన్‌స్పెక్టర్ జెండే మూవీలోనూ కనిపించింది.
Tags : 1