పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు
Breaking News
ఇదిగో ఇల్లు కొనాల్సింది ఇప్పుడే..
Published on Sat, 11/22/2025 - 11:03
రాష్ట్రంలో కొంతకాలం వరకూ స్థిరాస్తి మార్కెట్ స్తబ్దుగా ఉంది. ఇటీవల ప్రభుత్వ పోత్సాహకర నిర్ణయాలు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు అభివృద్ధి ప్రణాళికలు తదితరాలతో మార్కెట్ మళ్లీ గాడిలో పడుతోంది. ఇలాంటి సమయంలో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనాలంటే వేగవంతంగా విధానపరమైన నిర్ణయాలతో పాటు వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలి. అప్పుడే మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడి, క్రయవిక్రయాలు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఈ ప్రతికూల వాతావరణంలోనే ధరలు, వసతుల విషయంలో కస్టమర్లకు బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. నగదు లభ్యత కావాలి కాబట్టి డెవలపర్లూ అంగీకరించే వీలుంటుంది. – సాక్షి, సిటీబ్యూరో
మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడి దారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్బుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.
ఢోకా లేదు..
హైదరాబాద్‌లోని భౌగోళిక వాతావరణం, వనరులు, మౌలిక సదుపాయాలు, దేశ, విదేశీ సంస్థల కార్యాలయాలు.. ఇలా ఎన్నెన్నో అనుకూల పరిస్థితులు హైదరాబాద్‌కు ఉన్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ఇప్పటికీ హైదరాబాద్‌లో గృహాల ధరలు, అద్దెలు, భూముల రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం వంటివి నగరానికి అదనపు అంశాలు. దీంతో పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఏమాత్రం అలసత్వం ఉండదు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌కు ఢోకా ఉండదు.
ఇదీ చదవండి: ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!
Tags : 1