Breaking News

ఆరోగ్య బీమా పరిశ్రమ నష్టం

Published on Sat, 11/22/2025 - 03:55

న్యూఢిల్లీ: క్లెయిమ్‌లలో మోసాలు, దుర్వీనియోగం (ఎఫ్‌డబ్ల్యూఏ) తదితర కారణాలతో బీమా పరిశ్రమ ఏటా రూ. 10,000 కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది. దీని వల్ల వ్యవస్థపై నమ్మకం సడలుతోంది. మోసపూరిత ధోరణులు, ప్రక్రియల్లో సమర్ధత లోపించడం, నిబంధనల ఉల్లంఘనలు మొదలైనవి వ్యవస్థవ్యాప్తంగా వేళ్లూనుకుపోయి, మరింతగా పెరుగుతున్నాయని ఆరోగ్య బీమాపై బీసీజీ, మెడి అసిస్ట్‌ రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. 

ముందస్తుగా నివారించడం, మోసాలను గుర్తించడం, మోసాలకు పాల్పడకుండా కఠినచర్యలు తీసుకోవడంలాంటి మూడంచెల వ్యూహాన్ని పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించేందుకు, సాంకేతికత వినియోగాన్ని పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. క్లెయిమ్స్‌ ప్రాసెసింగ్‌లో మోసాలను రియల్‌ టైమ్‌లో నిరోధించేందుకు కృత్రిమ మేధ, జనరేటివ్‌ ఏఐ (జెన్‌ఏఐ) ఉపయోగపడగలవని నివేదిక తెలిపింది. రిపోర్టులో మరిన్ని విశేషాలు.. 

→ ఆరోగ్య బీమా పరిశ్రమ గత అయిదేళ్లుగా ఏటా 17 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోంది. 2025లో రూ. 1.27 లక్షల కోట్లకు చేరింది.  

→ రాబోయే అయిదేళ్ల వ్యవధి చాలా ఆశావహంగా ఉండనుంది. పరిశ్రమ సగటున 16–18 శాతం మేర వృద్ధి చెందుతూ, 2030 నాటికి రూ. 2.6 – రూ. 3 లక్షల కోట్లకు చేరనుంది. కాంపోజిట్‌ లైసెన్సులు, వ్యాల్యూ యాడెడ్‌ సరీ్వసులు మొదలైనవి మార్కెట్‌ ముఖచిత్రాన్ని మార్చివేయనున్నాయి. 

→ ఎలాంటి రిసు్కలు లేని క్లెయిమ్‌లు 90 శాతం ఉంటున్నాయి. అయితే, రెండు శాతం మాత్రం పూర్తి మోసపూరితమైనవిగా ఉంటున్నాయి. ఇక మరో 8 శాతం క్లెయిమ్‌లు కాస్త అటూ ఇటుగా ఉంటున్నాయి. నిఖార్సయిన పాలసీదారులకు అసౌకర్యం కలిగించకుండా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ తరహా క్లెయిమ్‌లలో కొంత అవకాశం ఉంటుంది. 

→ ప్రతి సంవత్సరం మోసపూరిత క్లెయిమ్‌లకు సంబంధించి ఎఫ్‌డబ్ల్యూఏ రూపంలో రూ. 8,000–10,000 కోట్ల చెల్లింపులు ఉంటున్నాయని అంచనా. దీని వల్ల బీమా సంస్థల మార్జిన్లు తగ్గుతున్నాయి. కస్టమర్లకు ప్రీమియం భారం పెరుగుతోంది. 

→ డిజిటల్‌ ఇంటెలిజెన్స్, కొత్త తరం టెక్నాలజీని వాడి ఈ సెగ్మెంట్లో మోసాలను అరికట్టవచ్చు. విశ్వసనీయతను పెంపొందించుకోవచ్చు. ఇలాంటి చర్యలతో, అందరికీ బీమా రక్షణ కలి్పంచాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అయిదేళ్లు ముందుగానే సాధించడానికి వీలవుతుంది. అలాగే ఆరోగ్య బీమా వ్యవస్థను పారదర్శకమైనదిగా, టెక్నాలజీ ఆధారితమైనదిగా తీర్చిదిద్దేందుకు సాధ్యపడుతుంది.

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)