Breaking News

నిర్వాహకులకు షాక్.. బిగ్‌బాస్ రియాలిటీ షోపై ఫిర్యాదు!

Published on Fri, 11/21/2025 - 18:24

బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ రన్ అవుతోంది. కన్నడలో ఈ ఏడాది కూడా హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్‌ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. మొదట రెండు రోజుల పాటు ఈ షో మూసివేశారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నాయని కొందరు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా ఆపేసి.. మళ్లీ రెండు రోజుల తర్వాత షో ప్రారంభించారు.

తాజాగా కన్నడ బిగ్‌బాస్‌ సీజన్-12పై మరో వివాదం మొదలైంది. బిగ్‌బాస్‌ హౌస్‌ కుల వివక్ష, మహిళలను అవమానించేలా ఉందంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సంధ్య పవిత్ర కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ షో హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిచ్చా సుదీప్‌తో పాటు కంటెస్టెంట్స్‌ అశ్విని గౌడ, రషిక పేర్లను ఫిర్యాదులో చేర్చింది.

కంటెస్టెంట్‌ రక్షితను అవమానించేలా హోస్ట్ సుదీప్ వ్యాఖ్యలు చేశారని సంధ్య పేర్కొంది. ఇది మహిళలను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఓ ఎపిసోడ్‌లో రషికపై మరో కంటెస్టెంట్‌ మాలవల్లి నటరాజ్ (గిల్లి) శారీరకంగా దాడి చేశాడని వెల్లడించింది. అంతేకాకుండా కర్ణాటక రక్షణ వేదికతో సంబంధం ఉన్న పోటీదారు అశ్విని గౌడను ఉద్దేశించి కుల వివక్ష వ్యాఖ్యలు చేయడం, రక్షిత నేపథ్యాన్ని అపహాస్యం చేశారంటూ ఫిర్యాదులో వివరించింది. అయితే ఈ వివాదంపై కిచ్చా సుదీప్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆయన 'మార్క్' షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 25న పండుగ విడుదల కానుంది.

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)