Breaking News

ఏఐ ఇన్‌ఫ్రా కోసం పాక్స్‌కాన్‌తో ఓపెన్‌ఏఐ జట్టు

Published on Fri, 11/21/2025 - 13:48

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ మౌలిక సదుపాయాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని AI డేటా సెంటర్ల కోసం అత్యాధునిక హార్డ్‌వేర్‌ను రూపొందించడానికి ఓపెన్‌ఏఐ ఫాక్స్‌కాన్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ సహకారం ద్వారా ఫాక్స్‌కాన్‌, ఓపెన్‌ఏఐలు కలిసి డేటా సెంటర్ సర్వర్ ర్యాక్‌లను అభివృద్ధి చేస్తాయి. ముఖ్యంగా ఈ ర్యాక్‌లను యూఎస్‌ అంతటా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా దేశంలో డేటా సెంటర్ సౌకర్యాల కోసం అవసరమైన కేబులింగ్, పవర్ సిస్టమ్స్, ఇతర కీలక పరికరాలను ఉత్పత్తి చేయాలని ఫాక్స్‌కాన్‌ యోచిస్తోంది. అయితే, ఈ ఒప్పందంలో నిర్దిష్ట కొనుగోలు నిబంధనలు ఏవీ లేవని ఇరు సంస్థలు స్పష్టం చేశాయి.

సరఫరా గొలుసుపై పట్టు

ప్రపంచంలో విలువైన ప్రైవేట్ సంస్థల్లో ఒకటైన ఓపెన్‌ఏఐ ఏఐ సరఫరా గొలుసుపై మరింత నియంత్రణ సాధించడానికి చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత కొన్ని నెలల్లో క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్లు, చిప్ తయారీదారులైన ఎన్‌వీడియా కార్ప్‌, అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్‌ ఇంక్‌(ఏఎండీ) వంటి కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంది.

ఫాక్స్‌కాన్‌ వ్యూహాత్మక విస్తరణ

ఓపెన్‌ఏఐతో తాజా ఒప్పందం ఫాక్స్‌కాన్‌కు ఎంతో కలిసొస్తుందని కొందరు భావిస్తున్నారు. ఈ భాగస్వామ్యం ఏఐ పర్యావరణ వ్యవస్థలో తన కార్యకలాపాలను విస్తరించడానికి దీర్ఘకాలిక వ్యూహాన్ని సూచిస్తుంది. కాగా, ఫాక్స్‌కాన్‌ విడిగా ఏఐ డేటా సెంటర్లను అన్వేషించడానికి ఇంట్రిన్సిక్‌(Intrinsic)తో ఉమ్మడి వెంచర్‌ను ప్రకటించింది.

ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)