Breaking News

‘రవితేజ ముందు ఒకలా..నరేశ్‌ ముందు మరోలా’ అని విమర్శించారు: భీమ్స్‌

Published on Thu, 11/20/2025 - 12:09

‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘12ఎ రైల్వే కాలనీ’ డిఫరెంట్‌ జోనర్‌ సినిమా. ఈ సినిమా మ్యూజిక్‌ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. శ్రీనివాసాగారు, నరేశ్‌గారు, డైరెక్టర్, రచయితలు నమ్మడం వల్లే నేను చేయగలిగాను. ఈ మూవీ ఔట్‌పుట్‌ చూశాక వారందరూ సంతోషంగా ఉన్నారు’’ అని సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో(Bheems Ceciroleo ) తెలిపారు. ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జోడీగా నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’(12A Railway Colony). పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్‌ కానుంది. 

ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో మాట్లాడుతూ– ‘‘మొదటిసారి ‘12ఏ రైల్వే కాలనీ’ లాంటి థ్రిల్లర్‌ మూవీకి సంగీతం ఇవ్వడం కొత్తగా అనిపిస్తోంది. ఇలాంటి జానర్‌లోనూ నేను సినిమా చేయగలను అనే నమ్మకాన్ని ఈ ప్రాజెక్టు ఇచ్చింది. నరేశ్‌గారికి గతంలో గుర్తుండిపోయే పాటలు ఇచ్చాను. ఈ సినిమాలో రెండు మెలోడీ సాంగ్స్‌ ఉన్నాయి. ఇక మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ మధ్య పోటీ గురించి ఆలోచించను. నేను ఆ జోనర్‌లో లేను. నన్ను నమ్మి సినిమా ఇస్తే ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. 

ఈ మధ్య కొన్ని కామెంట్స్‌ చూశాను. రవితేజగారు స్టేజ్‌పై ఉన్నప్పుడు ఒకలా, నరేశ్‌గారు స్టేజ్‌పై ఉన్నప్పుడు మరోలా మాట్లాడానని కామెంట్లు పెట్టారు. సంగీత దర్శకుడిగా నాకు మొదట అవకాశం ఇచ్చింది నరేశ్‌గారు... ఆగిపోయిన నా కెరీర్‌కి పునర్జన్మ ఇచ్చింది రవితేజగారు. ఇదే విషయాన్ని నేను చెప్పాను. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక విమర్శలు చేశారు. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, డెకాయిట్, టైసన్‌ నాయుడు, భోగి, ఫంకీ’ వంటి సినిమాలకి సంగీతం అందిస్తున్నాను’’ అని చెప్పారు. 
 

Videos

అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం

జగన్ కోసం తండోపతండాలుగా జనాలు... ABN, TV5 థంబ్ నైల్స్ పై అంబటి మాస్ ర్యాగింగ్

Hyd: స్టేట్ ఏదైనా తగ్గని జగన్ క్రేజ్

జలుబు, దగ్గు, గొంతు నొప్పికి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా?

Tripura: పికప్ వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు

రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ధార్మిక సంఘాలు

Devabhaktuni: ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వస్తుంటే చంద్రబాబు నిద్రపోతున్నారా..

ఎల్లో మీడియా విషపు రాతలు... ఇచ్చిపడేసిన జూపూడి

Corporator Sravan: చెరువులో దూకి కార్పొరేటర్‌ ఆత్మహత్యాయత్నం

Raja Singh: నీ లాంటి ఫాల్తూ డైరెక్టర్ ని ! జైల్లో వేసి..!!

Photos

+5

గ్రాండ్‌గా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా.. హాజరైన సినీతారలు (ఫోటోలు)

+5

భర్తతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోన్న అమలాపాల్ (ఫోటోలు)

+5

సిస్టర్‌ శిల్పా శిరోద్కర్ బర్త్‌డే.. చెల్లిపై నమ్రతా ప్రశంసలు (ఫోటోలు)

+5

రివాల్వర్ రీటా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. (ఫోటోలు)

+5

వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న సాయి పల్లవి సిస్టర్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌కు జగన్‌.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)