అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం
Breaking News
రూ.252 కోట్ల డ్రగ్స్ కేసు.. ఓర్రీకి నోటీసులు
Published on Thu, 11/20/2025 - 08:52
బాలీవుడ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న ఓర్రీ (ఓర్హాన్ అవత్రమణి) వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్.. 'బాలీవుడ్ బీఎఫ్ఎఫ్'గా ఒర్రీ పాపులర్. ఎక్కడ ఏ సెలబ్రిటీ ఫంక్షన్ జరిగినా వాలిపోతూ ఉంటాడు. తన చేష్టలతో నెట్టింట హల్‌చల్‌గా మారతాడు. అయితే, తాజాగా డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఓర్రీకి నోటీసులు జారీ చేశారని హిందీ మీడియా నివేదించింది.
రూ.252 కోట్ల రూపాయల మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి బాలీవుడ్ ఇన్‌సైడర్‌గా పేరున్న ఓర్రీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేసినట్లు ANI సంస్థ నివేదించింది. నేడు ఉదయం 10 గంటలకు యాంటీ-నార్కోటిక్స్ సెల్ (ANC) ఘట్కోపర్ యూనిట్ ముందు హాజరు కావాలని ఓర్రీని పోలీసులు కోరారు. విచారణలో మాత్రమే అతని పేరు కనిపిస్తుంది, అయితే ఈ కేసులో ఓర్రీ పాత్ర ఏమిటో పోలీసులు వెల్లడించలేదు.
అనేక నివేదికల ప్రకారం, ఇటీవల UAE నుండి వచ్చిన సలీం డోలా కుమారుడు తాహెర్ డోలాకు సంబంధించిన అనేక విచారణ పత్రాలలో ఓర్రీ పేరు బయటపడింది. సలీం డోలా భారతదేశంతో పాటు విదేశాలలో సెలబ్రిటీ పార్టీలలో బహిరంగంగా మాదకద్రవ్యాలను వినియోగించే భాగమని ఇండియా టుడే నివేదించింది.
Tags : 1