Breaking News

కోటి రూపాయలు జీతం ఇస్తామన్నా చేసేవారు లేరు..

Published on Mon, 11/17/2025 - 18:56

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలను కబళిస్తుందనే భయాలు పెరుగుతున్న తరుణంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరి​కలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగులు పోతాయని భయపడుతున్న వైట్‌కాలర్ ఉద్యోగాలతో పోలిస్తే నైపుణ్యం కలిగిన ట్రేడ్‌ల్లో(Skilled Trades) పని చేస్తున్న వారిపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఆనంద్‌ మహీంద్రా అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఏఐ వల్ల వైట్‌కాలర్ (సాఫ్ట్‌వేర్, డేటా ఎంట్రీ వంటి డెస్క్ ఉద్యోగాలు) ఉద్యోగులకు భారీగా లేఆఫ్స్‌ ఉంటాయని భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ కొన్ని అంశాలను పంచుకున్నారు. ‘దశాబ్దాలుగా మనం డెస్క్ ఉద్యోగాలను ఉన్నత స్థానాల్లో ఉంచాం. అదే సమయంలో నైపుణ్యం కలిగిన ట్రేడ్‌ ఉద్యోగాలను ఎక్కువగా ఎదగనివ్వలేదు. అయితే ఏఐకి భర్తీ చేయడం సాధ్యం కాని ఉద్యోగాలు ఇవే అని గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యోగాలకు నైపుణ్యం చాలా అవసరం. రియల్‌టైమ్‌ అనుభవం ముఖ్యం. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్‌లు, ట్రక్కు డ్రైవర్లు వంటి నైపుణ్యం గల కార్మికులను ఏఐ భర్తీ చేయలేదు’ అని చెప్పారు.

అమెరికాలో ఉద్యోగాల కొరత

మహీంద్రా హెచ్చరికలకు బలం చేకూర్చేలా ఫోర్డ్ మోటార్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లే కూడా ఇదే తరహా ప్రతిభ కొరతను ఎత్తి చూపారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఫార్లే మాట్లాడుతూ.. ఫోర్డ్‌లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంవత్సరానికి 1,20,000 డాలర్లు (సుమారు కోటి రూపాయలు) వరకు చెల్లిస్తున్నప్పటికీ, వాటిని భర్తీ చేయడానికి సరైన అభ్యర్థులు లభించడం లేదని ఆయన తెలిపారు.

భారీ ఆర్థిక నష్టం

ఈ సంక్షోభం ఫోర్డ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా అంతటా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ట్రక్కు డ్రైవింగ్‌, ఫ్యాక్టరీ ఆపరేషన్లతో సహా కీలకమైన రంగాలలో 10 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డెలాయిట్, ది మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ చేసిన అధ్యయనం ప్రకారం 2030 నాటికి యూఎస్‌లో తయారీ రంగంలోనే 21 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. దీని కారణంగా కలిగే మొత్తం ఆర్థిక నష్టం అప్పటికి 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా.

ఇదీ చదవండి: ఉదయం 5 గంటలకు ఈమెయిల్..

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)