ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?
Breaking News
రూ.750 కోట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్.. ఎక్కడంటే..
Published on Mon, 11/17/2025 - 15:09
దేశంలో టాప్ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో భారీ ఐటీ క్యాంపస్‌ను నిర్మిస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫోసిస్ నోయిడాలోని సెక్టార్-85లో 27.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఈ క్యాంపస్ నిర్మాణం మొదటి దశ కోసం ఇన్ఫోసిస్ సుమారు రూ.750 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ దశలో సుమారు 2.7 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంపస్ నిర్మాణం ముగిసి, పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత దాదాపు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
🚨 Infosys is constructing a massive IT campus in Noida, Uttar Pradesh.
(📹 -@theupindex) pic.twitter.com/QgswT8NDcv— Indian Tech & Infra (@IndianTechGuide) November 16, 2025
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్‌ల్లో ఒకటైన NCRలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఇది కంపెనీకి సహాయపడుతుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెక్నలాజికల్ ఇన్నోవేషన్‌లకు ఒక కీలకమైన కేంద్రంగా ఈ క్యాంపస్ మారుతుందని అధికారులు చెప్పారు. ఈ భవనం LEED ప్లాటినం రేటింగ్ (పర్యావరణ అనుకూల భవనాలకు లభించే అత్యున్నత అంతర్జాతీయ ధ్రువీకరణ) లక్ష్యంగా చేసుకుంటుంది. అంటే, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి, ఎనర్జీని సమర్థవంతంగా ఉపయోగించడానికి, ఉద్యోగులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ క్యాంపస్ అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు
Tags : 1